Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ వ‌రాల‌కు సినీపెద్ద‌ల హ‌ర్షం

By:  Tupaki Desk   |   23 Nov 2020 3:30 PM GMT
సీఎం కేసీఆర్ వ‌రాల‌కు సినీపెద్ద‌ల హ‌ర్షం
X
తెలంగాణ సిఎం కేసీఆర్ తన పార్టీ జి.హెచ్.ఎం.సి ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించ‌డంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక వ‌రాలిచ్చిన సంగ‌తి తెలిసిందే.

వాటిలో సినిమా హాళ్లు తిరిగి తెరవడం, జిఎస్‌టి రీయింబర్స్ మెంట్ కీల‌క‌మైన‌వి కాగా.. టాలీవుడ్ లోని 40వేల మంది సినీ కార్మికులకు రేషన్ కార్డులు ఉన్నాయని లేని వారికి రేష‌న్.. హెల్త్ కార్డులిస్తామ‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో థియేట‌ర్లు తెరిచేందుకు నేడు జీవోని ఇస్తున్నామని సీఎం అన్నారు.

సీఎం కేసీఆర్ వ‌రాల‌కు టాలీవుడ్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. తొలిగా మెగాస్టార్ చిరంజీవి.. కింగ్ నాగార్జున కేసీఆర్ ప్ర‌భుత్వంపై ప్ర‌శంస‌లు కురిపించారు. పరిశ్రమలో వ్యాపారాన్ని పునరుద్ధరించడానికి సిఎం కెసిఆర్ చొరవ చూపినందుకు చిరు తన ట్విట్టర్ లో ప్ర‌శంసించారు. “గౌరవనీయమైన సీఎం కేసీఆర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినీ పరిశ్రమకు సహాయక చర్యలు చేప‌ట్టినందుకు... మహమ్మారి వ‌ల్ల దెబ్బతిన్న పరిశ్రమను పునరుద్ధరించడానికి ఈ కారుణ్య చర్యలు తప్పనిసరిగా చాలా స‌హ‌కారం అవుతాయ‌ని న‌మ్ముతున్నాం. # తెలంగాణ CMO ” అంటూ చిరు ట్వీట్ చేశారు. కింగ్ నాగార్జున సైతం సీఎం చ‌ర్య‌ల‌ను సోష‌ల్ మీడియాల్లో ప్ర‌శంసించారు.

“కోవిడ్ తో ఈ చీకటి అలుముకుంది. అనిశ్చిత సమయాల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు అవసరమైన సహాయక చర్యలకు తెలంగాణ గౌరవనీయ సిఎం శ్రీ # కెసిఆర్ గారుకు కృతజ్ఞతలు`` అన్నారు నాగార్జున‌.

వాస్తవానికి తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క సమస్యలను ప‌రిష్క‌రించాల్సిందిగా చిరంజీవి- నాగార్జున త‌దిత‌ర పెద్దలు ఇటీవ‌ల కేసీఆర్ ని క‌లిసారు. ప‌లుమార్లు కెసిఆర్ ను.. అలాగే ఏపీ సీఎం జగన్ ను కలుసుకున్నారు. పరిశ్రమ సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. సీసీసీ పేరుతో లాక్ డౌన్ లో చిరు చేసిన స‌హాయ కార్య‌క్ర‌మాల గురించి తెలిసిన‌దే.