Begin typing your search above and press return to search.

చిరు - నాగ్ క్లాసిక్ స్టిల్.. ఇప్పటికైనా సినిమా చేస్తారా?

By:  Tupaki Desk   |   29 Aug 2022 10:30 AM GMT
చిరు - నాగ్ క్లాసిక్ స్టిల్.. ఇప్పటికైనా సినిమా చేస్తారా?
X
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఇతర హీరోలతో కూడా ఎంతో సన్నిహితంగానే ఉంటారు. అయితే అందులో ఎక్కువగా క్లోజ్ గా ఉండేది మాత్రం నాగర్జునతోనే అని చెప్పాలి. కేవలం తోటి నటుడు మాత్రమే కాకుండా పలు వ్యాపారాలలో కూడా చాలా సార్లు వీరిద్దరూ భాగస్వాములుగా కొనసాగారు. సాధారణంగా ఇండస్ట్రీలో ఈ ఇద్దరు ఎలాంటి బాధ్యత తీసుకున్న కూడా ఒకరికి ఒకరు సహాయం గా ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అలాగే సినిమా ప్రమోషన్స్ లో కూడా చిరంజీవి ఎప్పటికప్పుడు అక్కినేని హీరోలకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. కేవలం నాగార్జున చిరంజీవి మాత్రమే కాకుండా వారి తర్వాత తరం హీరోల మధ్యలో కూడా మంచి స్నేహభావం ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవి నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేకమైన ఫోటో పోస్ట్ చేసి తన స్పందించాడు.

హ్యాపీ బర్త్ డే మై డియర్ ఫ్రెండ్ నాగార్జున.. ఆయురారోగ్యాలతో సంతోషంగా విజయవంతంగా కొనసాగాలని అనుకుంటున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఒక ఫోటో కూడా పోస్ట్ చేశారు.

అందులో మెగాస్టార్ చిరంజీవి ఒక చైర్ పై కూర్చొని ఉండగా నాగర్జున చిరు భుజాలపై చేయి వేసి చిరునవ్వుతో స్టిల్ అయితే ఇచ్చాడు. ఇక ఆ ఫోటో నిమిషంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ తరం జనరేషన్ హీరోలలో మంచి స్నేహితులు అంటే వీరు ఇద్దరే అని కూడా చెప్పవచ్చు.

ఇక నాగార్జున చిరంజీవి కలిసి సినిమా చేస్తే చూడాలని ఉందని ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా వీరిద్దరూ కలిసి సినిమా చేసింది లేదు.

అప్పట్లో కె రాఘవేంద్రరావు బాగానే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అభిమానులను దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయడం చాలా కష్టమైన పని అని మళ్ళీ వెనుకడుగు వేశారు. ఇక ఇప్పుడు అలాంటి ఆలోచన లేకుండా మంచి కంటెంట్ తో సినిమా కలిసి చేస్తే వర్కౌట్ అవుతుంది అని చెప్పవచ్చు. మరి ఆ రూట్లో ఈ ఇద్దరు ఆలోచిస్తారో లేదో..



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.