Begin typing your search above and press return to search.
హాట్ నవ్: తలసానితో సినీపెద్దల తాజా భేటీ
By: Tupaki Desk | 10 Feb 2020 1:00 PM GMTహైదరాబాద్ సినీపరిశ్రమ పురోభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినీపెద్దలతో చర్చించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున సహా పలువురు సినీపెద్దలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాల్ని చర్చించిన సంగతి తెలిసిందే.
మరోసారి పరిశ్రమ పెద్దలతో మంతనాలు సాగిస్తామని అప్పట్లోనే సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని తెలిపారు. అందుకు సంబంధించిన కీలక భేటీ నేడు జూబ్లిహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు ఆసక్తికర విషయాల్ని చర్చించారని తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి.. సినీ కళాకారుల సంక్షేమంపై కీలకంగా చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్- చిరంజీవి-నాగార్జున ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ భేటీలో ఇంతకుముందు ప్రతిపాదించిన పలు విషయాల్ని చిరంజీవి సహా నాగార్జున ప్రస్థావించారని తెలిసింది. శంషాబాద్ పరిసరాల్లో పూణే ఫిలింఇనిస్టిట్యూట్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు స్థలం కేటాయించమని కోరారు. సినిమా 24 విభాగాల కార్మికులు.. టెక్నీషన్స్ నైపుణ్యంను మరింత మెరుగుపరిచేందుకు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అలాగే అపరిష్కృతంగా ఉన్న సినీకార్మికుల ఇండ్ల పథకాల గురించి మాట్లాడారు. చిత్రపురి కాలనీ పక్కనే ఇండ్లు లేని సినీ కార్మికులకు ఇండ్ల నిర్మాణానికి మరో 10 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. సినీ కళాకారుల కోసం కల్చరల్ కేంద్రం ఏర్పాటుకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2 ఎకరాల స్థలం కేటాయించాలన్న ప్రతిపాదనను సినీపెద్దలు తెచ్చారట. టికెట్ల ధరల సరళీకృత విధానంపైనా ముచ్చటించారని తెలిసింది.
సినీపరిశ్రమతో పాటుగా టీవీ కళాకారులకు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులను అందజేయాలని భేటీలో చర్చించారు. సినీ అవార్డుల ప్రధానం.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సినీ కార్మికులకు వర్తింపచేయాలని.. ఈఎస్.ఐ సౌకర్యం కల్పించాలని.. గ్రూప్ ఇన్సూరెన్స్ ను అమలు చేయాలని ఈ సందర్భంగా సినీపెద్దలు ప్రతిపాదించారు.