Begin typing your search above and press return to search.
సినీ పరిశ్రమ అంటే వారిద్దరే కాదు..?24 క్రాఫ్ట్స్ ఉంటాయి
By: Tupaki Desk | 11 Feb 2020 10:30 AM GMTఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలుగు సినీ పరిశ్రమ కూడా విభజన అవుతుందని.. ఏపీకి తరలివెళ్లిపోతుందని పుకార్లు వచ్చాయి. ప్రస్తుతానికి అయితే తెలుగు పరిశ్రమ హైదరాబాద్ లోనే కొనసాగుతోంది. అయితే రాష్ట్ర విభజన అనంతరం సినీ పరిశ్రమ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం మాదిరి కొన్ని ప్రకటనలు చేయగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమ అభివృద్ధిపై శ్రద్ధ పెట్టలేదు. విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న నంది అవార్డులను తెలంగాణ అసలే పట్టించుకోక పోగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అవార్డులను ప్రకటించి వదిలేసింది. ఇప్పటివరకు నంది అవార్డులను సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అందించలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉంది.
తాజాగా సినీ పరిశ్రమ అభివృద్ధిపై కొంచెం కదలిక వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల సినిమాటోగ్రఫీ మంత్రి సినీ పరిశ్రమపై దృష్టి సారించారు. తాజాగా రెండుసార్లు సినీనటులు చిరంజీవి - అక్కినేని నాగార్జునతో కలిసి మంత్రి సమావేశమయ్యారు. అధికారులతో సహా వారితో సమావేశం కావడంతో సినీ పరిశ్రమ ఆశలు పెంచుకుంది. అయితే సినీ పరిశ్రమపై చర్చించడానికి వారిద్దరే దొరికారా.. సినీ పరిశ్రమలో ఉన్నవారితో చర్చించారా అనే విమర్శలు మొదలయ్యాయి. కేవలం నటులతో భేటీ అయితే సినీ పరిశ్రమపై ఎలాంటి అవగాహన వస్తుందని - సినీ పరిశ్రమ అంటే 24 క్రాఫ్ట్ అనే విషయం మరచిపోరాదని గుర్తుచేస్తున్నారు.
సినీ పరిశ్రమలోని అన్ని రంగాలకు చెందిన వారితో ప్రభుత్వం చర్చలు చేసి సినీ పరిశ్రమ అభివృద్ధిపై సమాలోచనలు చేయాలని పేర్కొంటున్నారు. ప్రభుత్వం పరిశ్రమకు వాస్తవంగా మేలు చేయాలంటే అందరితో సంప్రదింపులు చేసి చర్యలు తీసుకోవాలని - కేవలం ఇద్దరు బడా వ్యాపార నటులతోనే సమావేశమైతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి - నాగార్జునలకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చెన్నై నుంచి పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో అప్పటి సినీ పెద్దలు మాత్రమే లబ్ధి పొందారనే విషయం గుర్తుచేస్తున్నారు.