Begin typing your search above and press return to search.
మెగా-పవర్ మల్టీస్టారర్.. దసరాకే ముహూర్తం?
By: Tupaki Desk | 3 Jan 2021 1:48 PM GMTమెగాస్టార్ గా వెండితెరను ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న నటుడు ఒకరు.. పవర్ స్టార్ గా ఎవ్వరికీ సాధ్యంకాని ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన నటుడు మరొకరు. అలాంటి వీరిద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటే..? థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. రికార్డులు షేక్ అయిపోవడం తథ్యం. తెరపై ఈ హీరోలిద్దరినీ చూడ్డానికి అభిమానులకు రెండు కళ్లూ చాలవు. ఈ కల ఎప్పుడు తీరుతుందోనని అభిమానులు అనుకుంటుండగా.. ఏకంగా సినిమా ప్రకటించేశారు సీనియర్ నిర్మాత టి.సుబ్బరామి రెడ్డి.
చిరంజీవి-పవన్ కళ్యాణ్ హీరోలుగా మెగా మల్టీస్టారర్ ను తీయబోతున్నట్టు చెప్పారు. టీఎస్సార్. 2017 ప్రారంభంలో ఈ మూవీ అనౌన్స్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా? అని ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే.. రిలీజ్ సంగతి అటుంచితే, ఇప్పటికి నాలుగేళ్లు కావొస్తున్నా.. సినిమా ప్రారంభం కాలేదు.
ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తారని కూడా టీఎస్సార్ ప్రకటించారు. చిరు, పవన్ తో సహా.. ఇండస్ట్రీలో పెద్దలందరితో సన్నిహిత సంబంధాలున్న టీఎస్సార్ చెప్పడంతో తప్పకుండా కార్యరూపం దాలుస్తుందని మెగా అభిమానులు భావించినప్పటికీ.. ఇంకా ఆ చిత్రం మొదలు కాలేదు.
అయితే.. ఈ మెగా మల్టీస్టారర్ కు కథ రూపొందించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. దీనికోసం త్రివిక్రమ్ టైం తీసుకుని ఉండొచ్చు. అదే సమయంలో పవన్ మూడేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వెళ్లారు. ఈ ప్రాజెక్టు ఆలస్యమవడానికి ఇవి కూడా కారణాలు కావొచ్చు. అయితే.. ఇప్పుడు పవన్ తిరిగి సినిమాలు ప్రారంభించారు. మెగాస్టార్ కూడా జోరుగా ప్రాజెక్టులు ప్రకటిస్తూ వెళ్తున్నారు. కాబట్టి మెగా మల్టీ స్టారర్ ను మళ్లీ తెరపైకి తేవడానికి ఇదే సరైన సమయమని టీఎస్సార్ భావిస్తున్నారట.
తన డ్రీమ్ ప్రాజెక్టులో కదలిక తెచ్చేందుకు నడుం కట్టిన సుబ్బిరామిరెడ్డి.. పవన్ - త్రివిక్రమ్ పై ఒత్తిడి పెంచే పనిలో ఉన్నారట. వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి, రాబోయే దసరా నాటికి ఈ మూవీని లాంఛ్ చేయాలని పట్టుదలగా ఉన్నారట టీఎస్సార్. విజయదశమికి కొబ్బరికాయ కొట్టి, 2022 నాటికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని యోచిస్తున్నారట.
కానీ.. చిరు,పవన్ తోపాటు త్రివిక్రమ్ కూడా తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ చేస్తున్న మెగాస్టార్.. ఆ వెంటనే ‘లూసీఫర్’ రీమేక్ చేసేందుకు అంతా సిద్ధమైంది. అది కూడా పూర్తయితే.. వేదాళం లైన్లో ఉంది. ఈ రీమేక్ కోసం ప్లాన్ కొనసాగుతోంది. ఇక పవన్ అయితే.. ఏకంగా నాలుగు సినిమాలు ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘వకీల్ సాబ్’ తర్వాత ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ లో నటించనున్నాడు పవన్. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒకటి, హరీశ్ శంకర్ డైరెక్షన్ లో మరొక ప్రాజెక్టు క్యూలో ఉన్నాయి. ఇక, త్రివిక్రమ్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయబోతున్నారు.
మరి, ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయి..? మెగా మల్టీస్టారర్ ఎప్పుడు మొదలవుతుంది? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే.. రంగంలోకి దిగింది టీఎస్సార్ కాబట్టి ఏదైనా జరగొచ్చు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే.. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ దసరాకు ప్రారంభం కావొచ్చు కూడా. కాదని ఎవరు చెప్పగలరు?