Begin typing your search above and press return to search.

బ్రదర్ కోసం ఆస్తులమ్మిన మెగా సోదరులు

By:  Tupaki Desk   |   25 Dec 2015 11:30 AM GMT
బ్రదర్ కోసం ఆస్తులమ్మిన మెగా సోదరులు
X
మెగా బ్రదర్ నాగేంద్ర బాబు చాలా నెమ్మదస్తుడని, మంచి వాడనే పేరుంది. మనిషి ఎంత భారీగా గంభీరంగా కనిపిస్తాడో, మనసు అంత సుకుమారమని అంటారు. ఇంత మంచి వాడికి కూడా ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించేంతటి బాధ కలిగిందట.

ఐదేళ్ల క్రితం అన్నయ్య మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమా తీశాడు నాగబాబు. ఆస్ట్రేలియాలో అంచనాలకు మించిన ఖర్చులతో, అత్యంత భారీగా తెరకెక్కిన ఈ చిత్రం.. చివరకు నిరాశ మిగిల్చింది. దీంతో నాగేంద్రబాబు అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పుడు తన వాళ్లు అనుకునేవాళ్లు చాలా మంది మోసం చేశారట. తాను నమ్మినవాళ్లే నట్టేట ముంచినంత పని చేశారని అంటున్నాడు మెగా బ్రదర్. అందరూ మోసం చేసిన సమయంలో.. తన సోదరులు ఇద్దరూ అండగా నిలబడ్డారని చెప్పాడు.

అన్నయ్య చిరంజీవి - తమ్ముడు పవన్ కళ్యాణ్ లు నాగేంద్రబాబుకు తోడు నిలిచి.. మొత్తం అప్పులన్నీ తీర్చేశారట. ఆర్థిక సమస్యల నుంచి తనను గట్టెక్కించడానికి సొంత ఆస్తులు కూడా అమ్మేశారట. దీంతో ఆ తర్వాత తన అలవాట్లను కూడా మార్చుకున్నానని, మరింతగా కష్టపడడం ప్రారంభించానని చెప్పాడు నాగేంద్రబాబు. ప్రస్తుతం అయితే ఈయనకు కొడుకు చేతికి అందొచ్చాడని చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్ లోని ప్రామిసింగ్ హీరోల్లో వరుణ్ తేజ్ ఒకడనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.