Begin typing your search above and press return to search.

పారితోషికంలో మెగాస్టార్ కి ఏమాత్రం త‌గ్గ‌ని రేంజు!

By:  Tupaki Desk   |   8 Feb 2022 1:30 AM GMT
పారితోషికంలో మెగాస్టార్ కి ఏమాత్రం త‌గ్గ‌ని రేంజు!
X
మెగాస్టార్ చిరంజీవి అంటే క‌మ‌ర్షియ‌ల్ బాక్సాఫీస్ కింగ్. కాసుల వ‌ర్షం కురిపించే గ్రేట్ స్టార్. ఆయ‌న పారితోషికం రేంజు కూడా అలానే ఉండేది. ఇక చిరంజీవి -అతిలోక సుంద‌రి శ్రీదేవి కాంబినేషన్ లో తెర‌కెక్కిన `జ‌గ‌దీకవీరుడు అతిలోక సుంద‌రి` 90ల‌లో ఎంత‌టి విజ‌యం సాధించిందో తెలిసిన‌దే. క‌ల్ట్ క్లాసిక్ జాన‌ర్ లో సంచ‌ల‌నం సృష్టించిన చిత్ర‌మిది. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు 9 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అప్ప‌ట్లో 15 కోట్లు వ‌సూళ్లు సాధించింది. చాలా థియేట‌ర్ల‌లో సినిమా 200 రోజులు కూడా ఆడింది. చిరంజీవి ఇమేజ్...శ్రీదేవి అందం అద్భుత న‌ట‌న‌.. ఇళ‌య‌రాజా మ్యూజిక్.. ఈ సినిమాను ఒక‌ స్థాయిలో నిల‌బెట్టాయి. అయితే ఈ కాంబినేష‌న్ ని సెట్ చేయ‌డానికి రాఘ‌వేంద్ర‌ర‌రావు చాలా క‌స‌ర‌త్తులే చేయాల్సి వ‌చ్చింది. అప్ప‌టికే శ్రీదేవి బాలీవుడ్ లో దూసుకుపోతుంది.

శ్రీ‌దేవి అంటే ఒక‌ బ్రాండ్ గా వెలిగిపోతున్న రోజుల‌వి. ఇటు మెగాస్టార్ తెలుగునాట పెద్ద స్టార్. అయితే అంత‌టి స్టార్ స‌ర‌స‌న న‌టించ‌డానికి శ్రీదేవి తొలిగా అంగీక‌రించ‌లేదు. చివ‌రికి ఆ కాంబినేష‌న్ అతిక‌ష్టం మీద ఒప్పించారు. అయితే ఈ సినిమాకు చిరంజీవి-శ్రీదేవి స‌మాన పారితోషికాలు అందుకున్న‌ట్లు నిర్మాత అశ్వీనిద‌త్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. చిరంజీవి 35 ల‌క్ష‌లు పారితోషికం ఇవ్వ‌గా..శ్రీదేవికి 25 ల‌క్ష‌లు క్యాష్ రేపేణా మిగ‌తా అమౌంట్ వివిధ‌రూపాల్లో అందించినట్లు చెప్పారు.

శ్రీదేవికి అంత పారితోషికం చెల్లించ‌డం వెనుక కార‌ణం ఆమె క్రేజ్ అని తెలుస్తోంది. అప్ప‌ట్లో శ్రీదేవి స్టార్ హీరోల‌కు స‌మానంగా పారితోషికాలు అందుకునేవారుట‌. ఆ విష‌యంలో మాత్రం అతిలోక సుంద‌రి ఏ మాత్రం తగ్గేవారు కాద‌ని మీడియాలో చాలాసార్లు ప్ర‌చారం సాగింది. ఆ త‌ర్వాత చిరంజీవి-శ్రీదేవి క‌లిసి మ‌రో రెండు చిత్రాల్లోనూ న‌టించారు. `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` చిత్రం త‌మిళ్ లో `కాద‌ల్ దేవ‌తైగా`.. హిందీలో `ఆద్మీ ఔర్ అప్స‌ర‌గా`..మ‌ల‌యాళంలో `హై సుంద‌రిగా` అనువాద‌మైంది.