Begin typing your search above and press return to search.

లైవ్ రిపోర్ట్: పీకే25 సెట్లో మెగాస్టార్

By:  Tupaki Desk   |   2 Sep 2017 8:18 AM GMT
లైవ్ రిపోర్ట్: పీకే25 సెట్లో మెగాస్టార్
X
ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆఫ్ లైన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ విపరీతమైన హంగామా చేసిపడేస్తున్నారు. మరోవైపు ఆన్ లైన్ అతా కూడా పవన్ నామ స్మరణే కనిపిస్తోంది. మెగా హీరోలు మాత్రమే కాదు.. ఇతర సెలబ్రిటీలు కూడా పవర్ స్టార్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పవర్ ను ఇలాగే కొనసాగించాలని విష్ చేస్తున్నారు.

అయితే.. ఇవాళ ఓ అపురూపమైన సంఘటన చోటు చేసుకుంది. అదే పవన్ కళ్యాణ్ షూటింగ్ చేస్తున్న స్పాట్ కు మెగాస్టార్ వెళ్లడం. ఇప్పటికే చిరు ఇంటికి వెళ్లికి మరీ అన్నయ్య నుంచి పవన్ ఆశీర్వాదాలు.. అభినందనలు అందుకోగా.. ఇప్పుడు చిరంజీవి సతీ సమేతంగా పవన్ షూటింగ్ జరుగుతున్న సెట్స్ కి వెళ్లారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ హైద్రాబాద్ పరిసరాలతో పాటు.. భారీగా నిర్మించిన సెట్స్ లో జరుగుతుండగా.. ఇప్పుడు పవన్ అన్నావదినలు అయిన చిరంజీవి-సురేఖలు ఇద్దరూ అక్కడే సందడి చేస్తున్నారు. దాదాపు గంట సేపటి నుంచి అక్కడే ఉన్న చిరు దంపతులు.. పవన్ తో బోలెడన్ని ముచ్చట్లు చెప్పించుకు మరీ వింటున్నారట.

పవన్ కళ్యాణ్ కు తన వదిన అంటే ఎంత గౌరవమో పలుమార్లు స్టేజ్ మీదనే చెప్పాడు. ఇప్పుడు ఆమె స్వయంగా షూటింగ్ స్పాట్ కు రావడంతో.. తెగ సంతోషించేస్తున్నాడట. ఇలా చిరు- సురేఖలు సెట్స్ కు వస్తున్నట్లుగా.. వారు వచ్చే వరకూ పవన్ కళ్యాణ్ కు కూడా తెలియదని.. అంతలా చిరు షాక్ ఇచ్చేశారని తెలుస్తోంది.