Begin typing your search above and press return to search.
చిరుతో ఉయ్యాలవాడ.. ట్రాక్ లో సూరి??
By: Tupaki Desk | 25 Jan 2017 6:46 AM GMTమెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నంబర్ 150.. ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 100 కోట్ల షేర్ వసూళ్లను అధిగమించే రూట్ లో ఖైదీ దూసుకుపోతుండగా.. ఇప్పుడు చిరంజీవి 151వ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. చిరంజీవికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ను తీయాలనేది చిరకాల కోరిక. ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఇదే సరైన సమయం అని చిరు భావిస్తున్నట్లు సమాచారం.
పరుచూరి బ్రదర్స్ ఇప్పటికే ఈ సబ్జెక్టును పూర్తి స్థాయిలో సిద్ధం చేసి ఉంచారనే టాక్ ఉంది. ఇప్పుడు దీన్నే 151వ సినిమాగా తీయబోతున్నారట. అయితే.. ఈ సబ్జెక్టుకు దర్శకత్వ పగ్గాలు బోయపాటి శ్రీనుకు ఇస్తారని భావించినా.. ఇప్పుడు సురేందర్ రెడ్డిని ఫైనలైజ్ చేశారనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ తో ధృవను సురేందర్ రెడ్డి హ్యాండిల్ చేసిన తీరుపై సంతృప్తిగా ఉన్న చిరు అండ్ టీం.. ఈ స్టైలిష్ డైరెక్టర్ చేతికి హిస్టారికల్ మూవీని అందించబోతున్నారట. పీరియాడికల్ మూవీ కావడంతో.. షూటింగ్ కి ఎక్కువ సమయం అవసరం కానుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి షూటింగ్ ను ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభించి.. వచ్చే ఏడాది అంటే 2018 సమ్మర్ నాటికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.
1857లో జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సమరం కంటే పదేళ్లకు ముందే దేశం కోసం ప్రాణం అర్పించిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. ఈ ప్రాజెక్టుపై చిరంజీవి చాలా కాలంగా ఆసక్తిగా ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/