Begin typing your search above and press return to search.
టాలీవుడ్ హిట్ కాంబో: 'చిరంజీవి - విజయశాంతి'
By: Tupaki Desk | 20 Aug 2021 2:08 AM GMTటాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి - లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లది హిట్ కాంబినేషన్. వెండితెరపై వీరిద్దరిని జోడీని చూడటాన్ని తెలుగు ప్రేక్షకులు ఇష్టపడతారు. పోటాపోటీగా చిరు - విజయశాంతి చేసే డ్యాన్సులు ఫైట్లు కామెడీ సన్నివేశాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వీరిద్దరూ కలిసి 21 సినిమాలు చేశారంటేనే.. అప్పట్లో ఈ కాంబోకి ఉండే క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలేంటో ఒకసారి చూద్దాం!
'ఛాలెంజ్' ౼ ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి - సుహాసిని - విజయశాంతి హీరోహీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. యండమూరి వీరేంద్రనాథ్ నవల ‘డబ్బూ టు ది పవర్ ఆఫ్ డబ్బూ’ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. ఈ సినిమాలోని ‘ఇందూవదాన’ పాట ఇప్పటికే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
'కొండవీటి రాజా' ౼ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. ఇందులో చిరంజీవి సరసన విజయశాంతితో పాటుగా రాధ కూడా హీరోయిన్ గా నటించారు. ఇది వీరి కాంబోలో వచ్చిన మరో సక్సెస్ ఫుల్ మూవీ.
'పసివాడి ప్రాణం' ౼ ఈ చిత్రానికి ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు. ఇది మలయాళ సూపర్ హిట్ ‘పూవిన్న పుతియా పూంతెన్నల్’ సినిమాకి తెలుగు రీమేక్. ‘కాశ్మీరీ లోయలో కన్యాకుమారి’ మరియు ‘బ్రేక్ డాన్స్’ పాటల్లో చిరు - విజయశాంతి జంట చేసిన డ్యాన్సులు అప్పట్లో ఓ ట్రెండ్ గా మారాయి. ఇందులో సుమలత మరో హీరోయిన్.
'స్వయంకృషి' ౼ కె. విశ్వనాథ్ దర్శకత్వం చిరంజీవి - విజయశాంతి నటించిన ఈ చిత్రం అనేక అవార్డులను గెలుచుకుంది. మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఉత్తమ నటుడిగా చిరు కు నంది అవార్డు తెచ్చిపెట్టింది.
'యముడికి మొగుడు' ౼ రవీరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫాంటసీ చిరంజీవి విభిన్నమైన పాత్రల్లో నటించారు. విజయశాంతి మరియు రాధ హీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో చిరు - విజయశాంతి ల ‘వనజల్లు గిల్లుకుంటే’ పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే.
'మంచి దొంగ' ౼ కె. రాఘవేంద్రరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవి - విజయశాంతి లతో పాటు సుహాసిని కూడా నటించారు. ఇది వీరి కలయికలో వచ్చిన మరో విజయవంతమైన చిత్రం.
'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' ౼ ఎ. కోదండరామి రెడ్డి ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహించారు. చిరంజీవి - విజయశాంతి ల హిట్ ట్రాక్ ను ఈ సినిమా కొనసాగించింది. ఇది తమిళ హిందీ భాషలలో రీమేక్ అయ్యింది.
'కొండవీటి దొంగ' ౼ ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయశాంతితో పాటుగా రాధ మరో హీరోయిన్ గా నటించింది. చిరంజీవి కెరీర్ లో అప్పటికి మోస్ట్ సక్సెస్ ఫుల్ సినిమా. ఇది 6-ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ లో విడుదలైన తొలి తెలుగు చిత్రం.
'గ్యాంగ్ లీడర్' ౼ విజయ బాపినేడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో చిరంజీవి - విజయశాంతి పోటాపోటీగా నటించారు. అప్పటికి ఇండస్ట్రీ హిట్ గా ఉన్న 'జగదేక వీరుడు అతిలోక సుందరి' కలెక్షన్లను ఇది బ్రేక్ చేసింది. కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ఈ సినిమా గురించి ఇప్పటికీ సినీ అభిమానులు గుర్తు చేసుకుంటుంటారు.
'మెకానిక్ అల్లుడు' ౼ బి. గోపాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది చిరంజీవి - విజయశాంతి కాంబోలో వచ్చిన చివరి సినిమా. ఇందులో అక్కినేని నాగేశ్వర రావు కీలక పాత్ర పోషించారు.
ఈ తరవాత కాలంలో విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ.. రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వెళ్లడంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమయ్యారు. 'ఖైదీ నెంబర్ 150' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నారు. మరి2రాబోయే రోజుల్లో మెగాస్టార్ - లేడీ సూపర్ స్టార్ ఇద్దరూ మళ్ళీ కలసి స్క్రీన్ షేర్ చేసుకుంటారేమో చూడాలి.