Begin typing your search above and press return to search.

చెర్రీని మెగాస్టార్ మంద‌లించిన వేళ‌..

By:  Tupaki Desk   |   18 Jun 2017 12:37 PM IST
చెర్రీని మెగాస్టార్ మంద‌లించిన వేళ‌..
X
మెగాస్టార్ న‌ట వార‌సుడు రాం చ‌ర‌ణ్ తేజ్ ఓపెన్ గా ఉంటారు. దాచుకోవ‌టాలు ఏమీ లేన‌ట్లుగా ఆయ‌న మాట్లాడుతుంటారు. ప్ర‌శ్న ఏదైనా.. స‌మాధానం వెనువెంట‌నే చెప్పేస్తారే కానీ.. వెన‌క్కి.. ముందుకు త‌గ్గ‌టాలు అస్స‌లు ఉండ‌వు. తాజాగా.. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు.

వాటిల్లో ముఖ్య‌మైన‌వి చూస్తే.. మిమ్మ‌ల్ని ఎప్పుడైనా చిరు తిట్టారా అన్న ప్ర‌శ్న‌కు చెర్రీ బ‌దులిస్తూ.. మ‌హిళ‌ల్ని గౌర‌వించే విష‌యంలో త‌న తండ్రి ముందుంటార‌ని.. ఇంట్లో అమ్మ‌ను ప‌ల్లెత్తు మాట కూడా అన‌ర‌న్నారు. మోస్ట్ హ్య‌పియ‌స్ట్ లేడీస్ లో త‌న త‌ల్లి ఒక‌ర‌న్న రాం చ‌ర‌ణ్‌.. తాను.. అమ్మ చాలా ఫ్రెండ్లీగా ఉంటామ‌న్నారు. అప్పుడ‌ప్ప‌డు మాటా మాటా అనుకుంటామ‌ని.. తిట్టుకుంటామ‌ని.. కాసేప‌టికే క‌లిసిపోతామ‌న్నారు.

ఇవ‌న్నీ త‌న తండ్రికి తెలీవ‌ని చెప్పిన చెర్రీ.. ఒక‌సారి అమ్మ‌ను చిన్న మాట అన్నందుకే కోప‌డ్డారంటూ జ‌రిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. ఒకసారి నాన్న‌.. అమ్మ‌.. తాను క‌లిసి కూర్చొని మాట్లాడుకుంటున్న‌ప్పుడు వెళ‌దాం ప‌దరా అని అమ్మ అంద‌ని.. వెంట‌నే తాను కూర్చోమ‌ని అన్నాన‌న్నారు.

ఈ విష‌యానికి నాన్న‌కు కోపం వ‌చ్చింద‌ని.. అమ్మ‌ని అలా అన‌కూడ‌ద‌ని.. అలా ఎలా మాట్లాడ‌తావంటూ క్లాస్ పీకార‌ని.. త‌న‌ను త‌న తండ్రి కోప్ప‌డ్డ సంద‌ర్భం అదేన‌న్నారు.

పెళ్లికి సంబంధించిన అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిస్తూ.. ఉపాస‌న‌ను తాను ప్రేమిస్తున్న విష‌యాన్ని ఎనిమిది నెల‌ల‌కు ముందే చెప్పాన‌ని.. వాళ్లింట్లో ఇష్ట‌మేనా? అని అడిగార‌న్నారు. వైవాహిక జీవితానికి సంబంధించి ఏదైనా స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇచ్చారా? అన్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. చాలామంది హీరోయిన్ల‌తో త‌న తండ్రి ప‌ని చేశార‌ని.. వారంతా త‌న త‌ల్లితో మాట్లాడుతూ చ‌నువుగా ఉండేవార‌న్నారు. చాలా బాగా మాట్లాడుండేవార‌న్నారు. ఆ విష‌యం మీద త‌న‌కు కొన్ని స‌ల‌హాలు ఇచ్చిన‌ట్లుగా చెప్పారు.

మీ నాన్న‌ను ఫాలో కాకూడ‌న్న విషయం ఏదైనా ఉందా? అన్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. త‌న తండ్రిది సాఫ్ట్ హార్ట్ అని.. చాలా సెన్సిటివ్ గాఉంటార‌న్నారు. కానీ.. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని త‌న తండ్రిని హ‌ర్ట్ చేసిన వారు.. వెన్నుపోటు పొడిచిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయ‌న్నారు. అయినా.. త‌న తండ్రికి కోపం రాద‌ని.. మోసం చేసిన వారిని సైతం ద‌గ్గ‌ర‌కు చేర్చుకుంటార‌న్నారు. ఇది త‌న‌కు ఇబ్బంది క‌లిగిస్తుంద‌ని.. కానీ.. ఎందుక‌లా చేస్తున్నార‌న్న‌ది త‌న‌కు ఇప్ప‌టికీ అర్థం కాద‌ని.. భ‌విష్య‌త్తులో అర్థ‌మవుతుందో చూడాల‌ని చెర్రీ చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/