Begin typing your search above and press return to search.

మహేష్ మూవీకి మెగాస్టార్ విషెస్

By:  Tupaki Desk   |   23 April 2018 5:28 PM GMT
మహేష్ మూవీకి మెగాస్టార్ విషెస్
X
ఒక స్టార్ హీరో సినిమా సక్సెస్ అయితే.. మరో స్టార్ హీరో విషెస్ చెప్పడం వంటివి ఇప్పుడు బాగానే కనిపిస్తున్నాయి. కానీ ఏ హీరో మూవీ అయినా సరే మనసారా అభినందించడం.. మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. విడుదలకు ముందే రషెస్ చూసేసి.. ఫలితాన్ని కూడా అంచనా వేసేస్తుంటారు చిరు. ఇండస్ట్రీలో ఆయన జడ్జిమెంట్ కు వాల్యూ ఎక్కువే.

ఇప్పుడు మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను.. థియేటర్లలో మామూలు హంగామా చేయడం లేదు. స్టడీగా కలెక్షన్స్ ను కొనసాగిస్తూ.. కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. వీకెండ్ ముగిసే సరికే.. తన టార్గెట్ లో దాదాపు 60 శాతాన్ని రాబట్టేసింది మహేష్ మూవీ. రీసెంట్ గా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కు సినిమా యూనిట్ అందరూ హాజరు కాగా.. ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ.. 'ఈ సినిమా చూసి చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేయడం ఆనందం కలిగించింది. మా చెల్లెళ్లు కూడా ఈ చిత్రాన్ని చూశారని మెగాస్టార్ అన్నారు. మంచి సినిమా చేశావని.. చాలా పెద్ద హిట్ అవుతుందని చిరంజీవి గారు చెప్పడం మరువలేను' అన్నారు.

తనకు ఇంతటి పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివకు హీరో మహేష్ బాబు కృతజ్ఞతలు చెప్పాడు. మహేష్ కారణంగానే ఈ చిత్రం ఇంతటి ఘనవిజయం సాధించిందన్న కొరటాల శివ.. ఈ మూవీలో పోసాని కృష్ణ మురళికి డైలాగ్స్ రాయడం భయపెట్టిందని.. ఆయన తన గురువు అని చెప్పాడు. పోసానితో తొలిసారి పని చేశానన్నాడు కొరటాల శివ.