Begin typing your search above and press return to search.
బాగా సన్నబడిన మెగాస్టార్
By: Tupaki Desk | 27 Dec 2018 5:02 PM GMTవినయ విధేయ రామ ఆడియో కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులంతా ఈ ఫంక్షన్ కి హాజరయ్యారు. అయితే ఎంతమంది వచ్చినా అందరి చూపు మెగాస్టార్ చిరంజీవి పైనే. దానికి కారణం.. ఆయన బాగా సన్నబడడమే. ఆరు నెలల క్రితం మెగాస్టార్ బాగా చబ్బీగా కన్పించారు. కానీ ఇప్పుడు చూస్తే..మొత్తం గెటప్పే మారిపోయింది. పక్కన రామ్‌చరణ్ ఎలా ఉన్నాడో - మెగాస్టార్ కూడా అలాగే ఉన్నాడు. ఇద్దరూ అన్నదమ్ముల్లా కన్పిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
సైరా సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు మెగాస్టార్. ఈ సినిమాలో వీరుడి పాత్రలో కన్పిస్తున్నారు. మరి వీరుడి పాత్ర అంటే ఎలా ఉండాలి.. అందుకోసమే జిమ్‌కు వెళ్లి మరీ బాగా స్లిమ్ అయ్యారు. ఒక వయసు దాటిన తర్వాత సన్నబడితే.. ముఖంలో తేడా వచ్చేస్తుంది. అందుకే.. ముఖంలో ఎలాంటి తేడా కన్పించకుండా.. కేవలం బాడీ మాత్రం తగ్గించే ఎక్స్ ర్ సైజ్ లు ఫిట్ నెస్ ట్రైనర్ల ఆధ్వర్యంలో చేస్తున్నారు మెగాస్టార్. అందుకే 4 నెలల నుంచి తన లుక్ బయటకు రాకుండా జాగ్తత్తపడ్డారు. కానీ ఇప్పుడు చరణ్ సినిమా ఆడియో కావడంతో… ఫంక్షన్‌కి వచ్చారు. అందరికి తన పిజిక్‌తో షాక్ ఇచ్చారు.