Begin typing your search above and press return to search.
అఖిల్ కోసం మెగాస్టార్ చిరు వస్తున్నారు
By: Tupaki Desk | 18 Dec 2017 4:03 PM GMTవినడానికి చాలా డిఫరెంట్ గా అనిపించి ఉండొచ్చు కాని.. అక్కినేని నాగార్జునతో ఉన్న ఫ్రెండ్ షిప్ ను బట్టి చూస్తే.. ఖచ్చితంగా ఇదేం పెద్ద వింత మాత్రం కాదు. అవును నిజం.. ఇప్పుడు ''హలో'' సినిమాను ప్రమోట్ చేయడానికి.. యంగ్ స్టర్ అకిల్ అక్కినేనికి విషెస్ చెప్పడానికి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. పదండి ఆ సంగతేంటో చూద్దాం.
మొన్న వైజాగ్ లో దుమ్మురేపే పెర్సామెన్స్ ఇస్తూ.. తన సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను తానే చాలా చక్కగా చేసుకున్నాడు అఖిల్. అయితే అక్కడకు చీఫ్ గెస్టుగా రాజకీయ నాయకులు.. మంత్రి గంటా శ్రీనివాసరావు విచ్చేశారు. ఇకపోతే ఇప్పుడు ''హల్లో'' సినిమా తాలూకు ప్రీరిలీజ్ ఈవెంటును హైదరాబాద్ లో జరుపనున్న సంగతి తెలిసిందే. 20వ తారీఖును జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా.. మెగాస్టార్ చిరంజీవి విచ్చేస్తున్నారు. ఆల్రెడీ నాగ్ కుటుంబంతో ఉన్న అనుబంధం.. అలాగే పెద్దాయన ఏఎన్నార్ పై చిరంజీవికి ఉన్న అభిమానం.. అలాగే రామ్ చరణ్ కు ఒక మంచి ఫ్రెండ్ అయిన అఖిల్ పై ఉన్న మమకారం.. చిరంజీవిని ఈ ప్రి రిలీజ్ పండుగకు వచ్చేలా చేస్తున్నాయి.
నిజానికి అక్కినేని ఫ్యామిలీకి.. చాలామంది హీరోలతో సత్సంబంధాలు ఉన్నాయి. వారికి రైవల్ హీరోస్ అలాగే రైవల్ ఫ్యాన్స్ అంటూ ఎవరూ ఉండరు. కాబట్టి చిరంజీవి రాక ఇప్పుడు వారి పాజిటివ్ ధృక్పదానికి మరో సంకేతం. ఇకపోతే హలో సినిమా డిసెంబర్ 22న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.