Begin typing your search above and press return to search.

బాలయ్య, చిరు.. గొడవ లేనట్లేనా?

By:  Tupaki Desk   |   23 April 2016 4:09 AM GMT
బాలయ్య, చిరు.. గొడవ లేనట్లేనా?
X
నందమూరి బాలకృష్ణ వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రారంభానికి చిరంజీవి హాజరవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి కారణం కొన్ని రోజుల క్రితం చిరుపై బాలయ్య పబ్లిక్ గా ఫైర్ అయ్యారనే ప్రచారం జరగడమే. అసలు చిరంజీవికి - బాలకృష్ణకు మధ్య ఏదో ఉందనే ప్రచారం బోలెడు జరిగింది.

లేపాక్షి ఉత్సవాలను దగ్గరుండి చూసుకున్న బాలయ్యను.. ఆ సమయంలో ఓ విలేఖరి మీ మిత్రుడు చిరంజీవిని పిలిచారా అడిగాడు. దీనికి సమాధానంగా 'నేను చిరంజీవి గారినే కాదు.. ఎవరినీ పిలవలేదు.. నా నెత్తిమీద ఎక్కే వారెవ్వరూ నాకు అక్కర్లేదు.'అన్నారు బాలయ్య. 'ఎవరినీ పిలవలేదు' అనే మాటను మాత్రం వదిలేసి, మిగతాదంతా పట్టుకుని మీడియా తెగ రచ్చ రచ్చ చేసింది.

అయితే.. చిరంజీవిపై బాలకృష్ణకు ఎప్పుడూ అభిమానం - గౌరవం - ప్రేమ ఉన్నాయన్నది సుస్పష్టం. మెగా60 బాష్ లో అందరూ చిరును విష్ చేస్తే.. ఒక్క బాలకృష్ణనే గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టుకున్న సీన్ ని అటు మెగా - ఇటు నందమూరి అభిమానులు మర్చిపోలేరు. ఇప్పుడు చిరుపై తనకున్న గౌరవంతోనే చిరంజీవిని బాలయ్య పిలవగా.. అదే గౌరవాన్ని నిలబెట్టుకుంటూ కార్యక్రమానికి వచ్చిన చిరు.. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి పాత్రను బాలయ్య తప్ప ఎవరూ చేయలేరని తేల్చేశారు.