Begin typing your search above and press return to search.
సర్దార్ ఆడియో.. చిరు ఏం చెప్తారో?!!
By: Tupaki Desk | 20 March 2016 4:45 AM GMTఇవాళ సాయంత్రం మెగాభిమానులకు పెద్ద పండగ. మెగా స్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఒకే వేదికపై కనిపించనున్నారు. వీరిద్దరీ ఉంటే మరో బ్రదర్ నాగబాబు కూడా వస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంటే ఈ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ వేడుకని.. ఆల్మోస్ట్ మెగా జాతరగానే చెప్పాలి.
అప్పుడెప్పడో గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ కు చిరు వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తమ్ముడి ఫంక్షన్ కి అటెండ్ కానున్న చిరంజీవి.. ఇప్పుడే విషయాలపై మాట్లబోతున్నారన్న ఆసక్తి అందరి లోనూ ఉంది. సాధారణంగా చిరు మాట్లాడే తీరు చూస్తే.. యూనిట్ మొత్తాన్ని అభినందిస్తారు. యాక్టర్ల నటనను - టెక్నీషియన్ల కష్టాన్ని ప్రశంసిస్తారు. ఇక తమ్ముడు పవన్ ని అయితే.. ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడచ్చనే అంచనాలున్నాయి. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితులు వేరు. గబ్బర్ సింగ్ విడుదల సమయంలో జనసేన పార్టీ అనేదే లేదు.
ఇప్పుడు పవన్ ఓ పార్టీ అధినేత అయితే, చిరంజీవి కాంగ్రెస్ నాయకుడు. దీంతో సర్దార్ ఫంక్షన్ లో చిరు స్పీచ్ లో పాలిటిక్స్ కూడా ఉంటాయనే టాక్ ఉంది. జనసేనను నడుపుతున్న పవన్ ను అభినందిస్తే.. ఆ పార్టీకి జీవం పోసినట్లే. ఇన్ డైరెక్టుగా మద్దతు ఇచ్చినట్లే. రాజకీయాల ఇలా ఉంటే.. గత కొంతకాలంగా మెగా బ్రదర్స్ మధ్య విబేధాలు అన్న మాటలకు కూడా సమాధానాలను చిరంజీవి స్వయంగా ఇవ్వనున్నారని తెలుస్తోంది.