Begin typing your search above and press return to search.
ఎంట్రీకి ముందే బుల్లితెరపై మెగా రచ్చ
By: Tupaki Desk | 24 Dec 2016 1:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి బుల్లితెర ఎంట్రీ ఖాయమై నెలలు గడిచిపోయింది. మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోను మెగాస్టార్ హోస్ట్ చేస్తారన్నది అఫీషియల్ న్యూసే. అయితే ఇప్పటివరకూ చిన్నా చితకా ప్రోమోస్ తప్ప.. రియల్ గా బుల్లితెరపై చిరును చూసి ఆస్వాదించే అవకాశం మాత్రం తెలుగు ప్రేక్షకులకు రాలేదు.
మొదటి షో టెలికాస్ట్ అయ్యాకే చిరంజీవి బుల్లితెర ప్రస్థానం అధికారం ప్రారంభమయినట్లు అవుతుంది. ఈ లెక్కన ఇంకా చిరు టెలివిజన్ ఎంట్రీ పూర్తి కాలేదనే చెప్పాలి. అయితే.. అరంగేట్రానికి ముందే టెలివిజన్ అవార్డుల పండుగకు మాత్రం విచ్చేశారు చిరంజీవి. తాజాగా జెమినీ టీవి పురస్కారాలు ఫంక్షన్ జరిగితే.. ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ హాజరయ్యారు.
టాలీవుడ్ నుంచి సాయిధరంతేజ్.. సందీప్ కిషన్.. లావణ్య త్రిపాఠి.. లాంటి మరికొంత మంది సినిమా వాళ్లు కూడా ఈ ఫంక్షన్ లో కనిపించారు కానీ.. చిరు అక్కడ ప్రత్యక్షమయ్యాక.. మిగతావాళ్లను పాయింట్ చేయడం కొంచెం కష్టమైన విషయమే. మరి చిరు చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ఆ అదృష్టవంతులు ఎవరో ఇంకా అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/