Begin typing your search above and press return to search.
చిరంజీవి ఆ క్లాసులకు వెళ్తున్నాడా?
By: Tupaki Desk | 3 March 2016 4:22 AM GMTఅరవయ్యేళ్ల వయసులో ఫిజిక్ కాపాడుకుని హీరోగా నటించడమంటే అంత సులువైన విషయం కాదు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి ఏడెనిమిదేళ్ల విరామం తర్వాత సినిమాల్లోకి పునరాగమనం చేస్తున్నారాయె. కాబట్టి ఫిజిక్ - లుక్ విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిందే. మెగాస్టార్ కూడా ఈ విషయంలో ఏ చిన్న ఛాన్స్ తీసుకుంటున్నట్లు లేడు. ఇప్పటికే బాడీ తగ్గించేందుకు ఆయన ఎంత శ్రమిస్తున్నారో ఏడాది కిందటికి, ఇప్పటికి ఆయనలో వచ్చిన మార్పు చూస్తేనే అర్థమవుతుంది. మొన్న ‘బ్రూస్ లీ’ సినిమాకే చిరు లుక్ లో ఎంతో ఛేంజ్ కనిపించింది. ఐతే ఆ ఫిజిక్, లుక్ కూడా చిరుకు సంతృప్తినిచ్చినట్లు లేవు.
‘కత్తి’ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లే సమయానికి బాడీలో మరింత ఛేంజ్ కోరుకుంటున్న చిరు.. ‘జుంబా’ క్లాసులకు వెళ్తున్నట్లు సమాచారం. జుంబా అంటే.. ఏరోబిక్స్ - డ్యాన్స్ రెండూ కలిపిన ఓ స్పెషల్ క్లాస్ అన్నమాట. దీని వల్ల మనిషి నాజూగ్గా తయారవడమే కాక.. బాడీలో ఓ రిథమ్ కూడా వస్తుంది. చిరంజీవి ఇప్పటికీ డ్యాన్సుల్లో అదరగొట్టేయగలడని అందరికీ తెలుసు. ఐతే చాలా విరామం వచ్చింది కాబట్టి, ఏమైనా తేడా వస్తుందేమో అని, పైగా బాడీ కూడా తగ్గుతుంది కదా అని.. ఈ జుంబా క్లాసులు ట్రై చేస్తున్నాడట మెగాస్టార్. త్వరలోనే ఈ క్లాసులు పూర్తి చేసుకుని.. తనను తాను మరింత ఫిట్ గా తయారు చేసుకుని.. ఆ తర్వాత రంగంలోకి దిగబోతున్నాడు చిరు. ఈ నెలాఖరులో చిరంజీవి రీఎంట్రీ మూవీ ప్రారంభోత్సవం జరుపుకోవచ్చని సమాచారం.