Begin typing your search above and press return to search.

#MAAelection : ఓటేశాక 'మా' ఎన్నికలపై చిరంజీవి, బాలయ్య హాట్ కామెంట్స్

By:  Tupaki Desk   |   10 Oct 2021 5:31 AM GMT
#MAAelection  : ఓటేశాక మా ఎన్నికలపై చిరంజీవి, బాలయ్య హాట్ కామెంట్స్
X
మా' ఎన్నికలు ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. జూబ్లీ హిట్స్ లోని పబ్లిక్ స్కూల్ లో 8గంటల నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సినీ తారలు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ 'మా' ఎన్నికల్లో తొలి ఓటును వినియోగించుకున్నారు. అందరికంటే ముందే ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకొని మొదటి ఓటు వేశారు. ఆ తర్వాత సినీ ప్రముఖులు అంతా ఒక్కొక్కరుగా వచ్చి ఓటు వేస్తున్నారు.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు మా పోలింగ్ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు రాత్రి ప్రకటిస్తారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

పవన్ తర్వాత వరుసగా చిరంజీవి, రాంచరణ్, బాలక్రిష్ణ, నరేశ్, సాయికుమార్, శివాజీరాజా, సుడిగాలి సుధీర్ సహా సినీ ప్రముఖులు అంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

-నా అంతరాత్మ ప్రభోదానుసారం ఓటేశా: చిరంజీవి
మా ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 'మా' ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పరిస్థితులు ఎప్పుడూ ఓకేలా ఉండవన్నారు. అన్ని సార్లు ఇదే స్థాయిలో వాడీవేడిగా ఎన్నుకలు జరుగుతాయని తాను అనుకోవడం లేదన్న చిరు.. భవిష్యత్ ఇలా జరగకుండా ఉండేలా మా ప్రయత్నాలు చేస్తామన్నారు. 'మా' ఎన్నికల్లో ఓటు వేయకపోవడం సినీ హీరోల వ్యక్తిగత విషయం అని.. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. కొందరు షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల ఓటు వేయలేకపోవచ్చని.. దాని గురించి ప్రత్యేకంగా తాను మాట్లాడనని తెలిపారు.

-ప్రకాష్ రాజ్, మంచు విష్ణులు అన్నాదమ్ముల్లాంటివారు: బాలక్రిష్ణ
మా ఎన్నికల్లో పోటీచేస్తున్న 'ప్రకాష్ రాజ్', మంచు విష్ణులు అన్నదమ్ముల్లాంటి వారని స్టార్ హీరో బాలక్రిష్ణ అన్నారు. 'మా' ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటు వేశా.. రెండు ప్యానల్స్ ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్టు కనిపించారు. ఇరు ప్యానల్స్ లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశారు. ఏదైనా అధ్యక్షులుగా నిలబడిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ ఇండస్ట్రీకి అన్నాదమ్ముల్లాంటి వారే. ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదు.. చేసే వాళ్లే. షూటింగ్స్ లో అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటాం. 'మా' అంతిమలక్ష్యం నటీనటుల సంక్షేమం.. ఎవరు గెలిచినా వారు వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తాం అని బాలయ్య అన్నారు.