Begin typing your search above and press return to search.

డ్రెస్ కోడ్‌ తో చిరు బ‌ర్త్‌ డే బాష్!

By:  Tupaki Desk   |   19 Aug 2015 9:33 AM GMT
డ్రెస్ కోడ్‌ తో చిరు బ‌ర్త్‌ డే బాష్!
X
మెగాస్టార్ పుట్టిన‌రోజు వేడుక‌ల‌కి రంగం సిద్ధ‌మైంది. రెండు మూడు రోజుల‌పాటు వేడుక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. చిరు 60వ పుట్టిన‌రోజు కాబ‌ట్టి సెల‌బ్రేష‌న్స్ స్పెషల్‌ గా, గ్రాండ్‌ గా ఉండాల‌ని ప్లాన్ చేసింది మెగా కుటుంబం. 21 అర్ధ‌రాత్రి అభిమానుల మ‌ధ్య పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుపుకొనే చిరు 22న రాత్రి గ్రాండ్‌ గా ఫిల్మ్ ఇండ‌స్ట్రీ కి పార్టీ ఇవ్వ‌బోతున్నారు. ఆ పార్టీ కోసం పార్క్ హ‌య‌త్ హోట‌ల్ ముస్తాబవుతోంది. మెగా ఫ్యామిలీ ప్ర‌త్యేకంగా ఆ పార్టీకి పిలిచేందుకు ఇన్విటేష‌న్ కార్డ్స్ కూడా సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం.

పార్టీకి హాజ‌ర‌య్యే అతిథులంతా కూడా ఫార్మ‌ల్ డ్రెస్‌ లో బ్లాక్ టై క‌ట్టుకొని రావాల‌ని డ్రెస్ కోడ్ పెట్టారు. హైలీ గా జ‌రిగే ఆ వేడుక‌కి ప‌రిశ్ర‌మ ముఖ్యులు మాత్ర‌మే హాజ‌ర‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. చిరు రాజ‌కీయాల్లోకి వెళుతున్న‌ప్పుడు కూడా ఇలాగే గ్రాండ్‌ గా ప‌రిశ్ర‌మ‌కి పార్టీ ఇచ్చారు. ఇప్పుడు మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సంద‌ర్బంలోనూ పార్టీని అరేంజ్ చేయ‌డం విశేషం. చాలా రోజులుగా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటున్న చిరు.. ఇక‌పై మ‌ళ్లీ నా వాళ్ల‌తో క‌లిసి మెల‌సి సినిమా చేయ‌బోతున్నా క‌దా అనే ఈ పార్టీని అరేంజ్ చేసిన‌ట్టు తెలిసింది. బాలీవుడ్, కోలీవుడ్ ప్ర‌ముఖులు కూడా పార్టీకి హాజ‌రు కావొచ్చ‌ని తెలిసింది.

తండ్రి పుట్టిన‌రోజు వేడుక‌ల్ని పుర‌స్క‌రించుకొని రామ్‌ చ‌ర‌ణ్ రెండు మూడు రోజుల‌ పాటు షూటింగ్‌ కి సెల‌వు చెప్పేశాడ‌ట‌. ఇప్పుడంతా ఆ ఏర్పాట్ల‌ లోనే నిమ‌గ్న‌మ‌య్యాడ‌ని స‌మాచారం. ప‌వ‌న్ మాత్రం ఈ వేడుక‌కి దూరంగా ఉంటాడ‌ని తెలిసింది. ఆయ‌న ప్ర‌స్తుతం `స‌ర్దార్‌`షూటింగ్‌ లో బిజీగా గ‌డుపుతున్నారు.