Begin typing your search above and press return to search.

60వ పుట్టినరోజు.. అర్థరాత్రి 12గంటలకు

By:  Tupaki Desk   |   19 Aug 2015 8:11 AM GMT
60వ పుట్టినరోజు.. అర్థరాత్రి 12గంటలకు
X
మెగాభిమానులు సిసలైన పండుగ చేసుకొని చాలా సంవత్సరాలే అయ్యింది. అన్నయ్య చిరంజీవి రాజకీయాల్లోకి వెళుతూ ముఖానికి రంగేసుకోవడం మానేసిన రోజున అంతా కినుక వహించారు. ఆ కినుక ఇప్పటికీ అలానే ఉంది. అయితే ఇక అన్నయ్య రూటు మారుస్తున్నారు. తిరిగి ముఖానికి రంగేసుకుంటున్నారు. 150వ సినిమాలో నటిస్తున్నారు అనగానే మళ్లీ నూతనోత్సాహం ఫ్యాన్స్‌ లో కనిపించింది. ఇప్పుడు ఆ ఉత్సాహం పీక్స్‌ కి వెళ్లే టైమొచ్చేసింది.

ఆగష్టు 22న మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు కాబట్టి వేడుకలకు అన్నీ సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్‌ శిల్పకళావేదిక అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఆగస్టు 21 మిడ్‌ నైట్‌ 12 గంటలకు చిరు కేక్‌ కట్‌ చేసి అభిమానుల సమక్షంలో పుట్టిన రోజును ఘనంగా చేసుకుంటున్నారు. ఈ వేడుక లో చరణ్‌, బన్ని పాల్గొంటారు. మెగా యువ హీరోలంతా పాల్గొంటారు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా పాల్గొంటున్నారని సమాచారం. ప్రతిసారీ పుట్టిన రోజు వేరు. ఈసారి పుట్టినరోజు వేరు. చిరంజీవి 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ఇది. అందుకే అది మెగా ఫ్యామిలీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. అందుకే 21 రాత్రి అంగరంగ వైభవంగా విందు ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కేక్‌ లు, కోక్‌ లకు కొదువే ఉండదు.

అలాగే మెగాస్టార్‌ హిట్‌ సాంగ్స్‌ కి మెడ్లీస్‌ కూడా రెడీ చేస్తున్నారు. వేదిక పై డ్యాన్సుల కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ వేడుకల్లో పవన్‌ పాల్గొనడం లేదు. ప్రస్తుతం అతడు సర్ధార్‌ గబ్బర్‌ సింగ్‌ షూటింగ్‌ కోసం గుజరాత్‌ వెళ్లాడు. ఇప్పటికే ముందస్తుగా ఓ బొకే పంపించాడని సమాచారం. అంతేకాదు.. 150వ సినిమా ప్రకటన ఆరోజు వెలువడదు. మరో మూడు నెలలు పడుతుందని చిరునే స్వయంగా చెప్పారు.