Begin typing your search above and press return to search.

హ్యాపి బిడే: నాన్న‌కు ప్రేమ‌తో చెర్రీ ముద్దు ఇలా..!

By:  Tupaki Desk   |   22 Aug 2021 2:30 PM GMT
హ్యాపి బిడే: నాన్న‌కు ప్రేమ‌తో చెర్రీ ముద్దు ఇలా..!
X
22 ఆగ‌స్ట్ మెగాస్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని సినీరాజ‌కీయ ప్ర‌ముఖులు స‌హా అభిమానులు ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. సోష‌ల్ మీడియాల్లో శుభాకాంక్ష‌ల‌ సునామీ పోటెత్తింది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు స‌హా ఈసారి ప్ర‌జ‌ల్లోనూ మెగాస్టార్ పై నూత‌నోత్సాహం ప‌ర‌వ‌ళ్లు తొక్కింది. ప‌రిశ్ర‌మ అగ్ర క‌థానాయ‌కులంతా మెగాస్టార్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు. మాజీ ముఖ్య‌మంత్రి తేదేపా అధినేత చంద్ర‌బాబు నాయుడు సైతం ఫోన్ లో మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్ష‌లు తెలిపారు. క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ .. తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం చిరంజీవికి ట్విట్ట‌ర్ లో ప్ర‌త్యేకించి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఇక మెగా కుటుంబ స‌భ్యులంతా నేరుగా మెగాస్టార్ ని జూబ్లిహిల్స్ లోని స్వ‌గృహంలో క‌లుసుకుని కేక్ క‌టింగ్ కార్య‌క్ర‌మం చేసి స్వీట్లు తినిపిస్తూ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ వేడుక‌ల్లో మెగా హీరోలంతా ఉన్నార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ ..వ‌రుణ్ తేజ్ స‌హా మేన‌ల్లుళ్లు సాయి తేజ్.. వైష్ణ‌వ్ తేజ్.. త‌దిత‌రులు చిరుని ఇంటి వ‌ద్ద క‌లిసి విషెస్ తెలిపారు. చెర్రీ స‌తీమ‌ణి మెగా కోడ‌లు ఉపాస‌న మామగారికి ప్ర‌త్యేకించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులకు మెగాస్టార్ ధీవెన‌లు అందించారు. ఇక నాన్న‌కు ప్రేమ‌తో దృశ్యం ఈ సంద‌ర్భంగా అక్క‌డ క‌నిపించింది. చెర్రీ అలా చిరు చిక్ పై ఎంతో ప్రేమ‌గా ముద్దు పెట్టి అభిమానం కురిపించారు. ఇక ఈ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ లో మెగాస్టార్ చెంత‌నే శ్రీ‌మ‌తి సురేఖ కొణిదెల ఉన్నారు. మెగాస్టార్ కోస‌మే కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ని స్థాపించి వ‌రుస‌గా చిరు క‌థానాయ‌కుడిగా సినిమాలు నిర్మిస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందిస్తూ ప్ర‌తిసారీ ప్రేమ‌ను కురిపిస్తున్న చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు వేళ ఇలా స్పెష‌ల్ గా విషెస్ తెల‌ప‌డం అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి- నాగ‌బాబు- ప‌వ‌న్ క‌ల్యాణ్ బృందం హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీ లొకేష‌న్ లో షూటింగ్ చేస్తుండ‌గా లంచ్ చేసిన సంగ‌తిని మెగాభిమానులు మ‌రువ‌లేరు. త‌న‌యుల‌కు వ‌డ్డిస్తూ ఆన్ లొకేష‌న్ అమ్మ అంజ‌నా దేవి ప్రత్య‌క్ష‌మ‌వ్వ‌డం మ‌ర‌పురాని జ్ఞాప‌కం అని చెప్పాలి.