Begin typing your search above and press return to search.
బర్త్ డే స్పెషల్: కమర్షియల్ సినిమా స్టామినాని శిఖరానికి చేర్చిన గ్రేట్ మెగాస్టార్
By: Tupaki Desk | 21 Aug 2021 6:30 PM GMTపద్మభూషణ్ పురస్కార గ్రహీత .. కళాప్రపూర్ణ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి.. 66వ పుట్టినరోజు వేడుకల్ని అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. 66 వయసులో చిరు ఇంకా నవయువకుడిలా అలుపెరగక వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు నాలుగు సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు సవాల్ గా మారారు.
దశాబ్ధాల కెరీర్ లో ఆయన ప్రస్థానాన్ని ఓ మారు స్ఫురణకు తెచ్చుకుంటే .. అప్పటివరకూ స్థబ్ధుగా ఉన్న తెలుగు సినిమా పరిశ్రమ పరుగును కొత్త దారిలోకి తీసుకెళ్లిన ఘనత మెగాస్టార్ చిరంజీవికి దక్కుతుంది. పాపికొండల వద్ద గోదావరి ఉధృతాన్ని వేగాన్ని సంతరింప జేసి అంతవరకూ ప్రయాణిస్తున్న బాటను మలుపు తిప్పి సరికొత్త దారుల్లో పరిశ్రమను సంచరింప జేసిన ఘనత చిరంజీవిది. వయో లింగ భేధం లేకుండా ఆబాలా గోపాలాన్ని అనునిత్యం అలరించిన అగ్ర కథానాయకుడు ఆయన. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చిరంజీవిని తమవాడిగా భావించారు. తమ సొంత మనిషిలా అనుకున్నారు. ఆయన నటించిన సినిమా చూడడం ఒక అవసరంలా చేసుకున్నారు. అందుకే తెలుగు సినిమా వాణిజ్యానికి కేంద్ర బిందువు.. తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన గొప్ప కథానాయకుడు అయ్యారు చిరంజీవి.
కెరీర్ లో పునాది రాళ్లు చిత్రానికి తొలి సంతకం చేసినా ప్రాణం ఖరీదు తొలి రిలీజ్. ఆ తర్వాత బాపు తెరకెక్కించిన మన ఊరి పాండవులు చిరు కి మేలి మలుపు. చిత్రపరిశ్రమ తనను ఎలా ఉపయోగించుకోవాలో అలా వినియోగించుకుంటుందని చిరంజీవి నమ్మకం. అందుకే ప్రతినాయక పాత్రలు చేయడానికి సైతం వెనకాడలేదు. తొలుత ఎన్టీ రామారావుతో తిరుగులేని మనిషి.. కృష్ణ తో కలిసి కొత్త పేట రౌడీ.. శోభన్ బాబుతో మోసగాడు వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించారు..1980లో నెగెటివ్ షేడ్ ఉన్న హీరో పాత్ర పున్నమి నాగు చిత్రంలో ఆయనకు లభించింది. ఆ చిత్రం ఆయనలో నటుడిని చాలా ఎత్తుకు పెంచి యువతలో ప్రత్యేకమైన క్రేజును పెంచింది. నటుడిగా వ్యక్తిగతంగానూ 1980 ఆయనకు మరపురాని సంవత్సరం. ఇదే ఏడాది సుప్రసిద్ధ నిర్మాత అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖను చిరంజీవి పెళ్లాడారు. 1982లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య .. శుభలేఖ చిత్రాలు సోఫిసటికేటెడ్ హీరోగా గుర్తింపును తెచ్చి పెట్టాయి. చిరంజీవి రాకతో తెలుగు సినిమా మౌలిక లక్షణాలు మారిపోయాయి. అంతవరకూ ధీరోదాత్తత ఉన్న హీరో పాత్రల స్థానే హీరోదాత్తత ప్రస్పుటంగా కనిపించే పాత్రలు చోటు చేసుకోవడం ప్రారంభించాయి. 1982లో విడుదలైన ఖైదీ చిత్రం తెలుగు సినిమా రూపురేఖల్ని సమూలంగా మార్చివేసింది. ఎ.కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిరంజీవిలోని అభినయం ప్రావీణ్యత ఆయనను స్టార్ హీరోగా ఎంతగానో ప్రమోట్ చేయడమే గాకుండా తెలుగు సినిమా గమనాన్నే ఈ చిత్రం మార్చివేసింది. ఈ చిత్రంతో తెలుగు సినీపరిశ్రమలో ఎదురేలేని హీరోగా స్థిరపడ్డారు చిరంజీవి. మగమహారాజు-అభిలాష-విజేత-మగధీరుడు వంటి చిత్రాలు కుటుంబ కథలతో తెరకెక్కి ఆ తరహా ప్రేక్షకుల్ని అభిమానులుగా మారిస్తే.. మంత్రిగారి వియ్యంకుడు-ఛాలెంజ్ - సంఘర్షణ వంటి చిత్రాలు యువతను ఉర్రూతలూగించాయి. రాక్షసుడు కమర్షియల్ గా పరిధిని పెంచితే ఆరాధన నటుడిగా ఆయనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. 80వ దశకం ఆరంభంలో ఆయన కెరీర్ లో ఎప్పటికప్పుడు విజయాలతో సుసంపన్నం చేసుకుంటూ మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని మహత్తర శక్తిగా చిరంజీవిని నిలబెట్టింది. దాదాపు మూడు దశాబ్ధాలు ఆ ప్రభంజనం అదే వరుస కొనసాగింది. ఎన్టీ రామారావు కృష్ణ తర్వాత మాస్ లో అంతటి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో చిరంజీవి.. చిత్ర చిత్రానికి నటనలో డ్యాన్సుల్లో పరిణతిని వైరుధ్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన చిరంజీవి తెలుగు సినిమా వాణిజ్యాన్ని తన చిత్రాలతో మరింత విస్త్రతిని పెంచారు. చిరంజీవి నటించిన ప్రతి సినిమా వాణిజ్యంలో విపరీతమైన సంచలనాలను సృష్టించాయి. పరిశ్రమ వ్యాపార వర్గాలు విస్తుపోయి విస్మయం పొందే రీతిలో చిరంజీవి సినిమాల బిజినెస్ సాగింది. అంతవరకూ సినిమా పరిశ్రమ ఎరుగని వాణిజ్యపు లెక్కలు చిరంజీవి సినిమాలతోనే చరిత్రలో వెలుగు చూశాయి. నేటి తెలుగు సినిమా వ్యాపారానికి సమూలమైన మార్పులు తీసుకొచ్చి సువర్ణమయపు దారులు వేసిన తొలి తెలుగు కథానాయకుడు చిరంజీవి అంటే అతిశయోక్తి కానే కాదు. మూసధోరణిలో డ్యాన్సులు చేసే పద్ధతులకు స్వస్థి చెప్పి పాశ్చాత్య నృత్య రీతులను చేయడం నేర్పింది చిరంజీవి.
పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డ్యాన్సులు ప్రవేశపెట్టి నృత్యాల్ని కొత్త పోకడ పట్టించిన హీరో చిరంజీవి. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొండవీటి దొంగ- జగదేక వీరుడు అతిలోక సుందరి- ఘరానా మొగుడు వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్లతో సంచలనాలు నమోదు చేశారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో శుభలేఖ కుటుంబ ఆడియెన్ ని చేరువ చేసింది.
అంజనా ప్రొడక్షన్స్ రుద్రవీణ జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా సంచలనం సృష్టించింది. 1990లో పెను తుఫాన్ లా వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి .. ఘరానా మొగుడు చిరంజీవి ఇమేజ్ ని స్కైలోకి తీసుకెళ్లాయి. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా హిట్లర్- మాస్టర్ - బావగారు బాగున్నారా- ఇద్దరు మిత్రులు- అన్నయ్య లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఇంద్ర - ఠాగూర్ - స్టాలిన్ లాంటి సంచలన చిత్రాలు తెలుగు ప్రజల మనన్ననలు అందుకున్నాయి. ఇక 1998 అక్టోబర్ లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్తాపించి ఐ అండ్ బ్లడ్ బ్యాంకులతో సేవలు ప్రారంభించారు. అభిమానులను ఇందులో భాగం చేశారు. స్వయం కృషి- ఆపద్భాందవుడు వంటి అవార్డు చిత్రాలతోనూ చిరంజీవి తనలోని నటుడిని మరో కోణంలో పరిచయం చేసారు. కెరీర్ లో నంది అవార్డులను జాతీయ అవార్డులను అందుకున్నారు. ఆ తర్వాతా అందరికీ తెలిసినది ఒక చరిత్ర.
రాత్రికి రాత్రే మెగాస్టార్ కాలేరు. పడుతూ లేస్తూ ఎదిగేవారే స్ఫూర్తి ప్రధాతలు అవుతారు. నేడు 150 సినిమాల్లో నటించిన అజేయమైన స్టార్ మన మెగాస్టార్. వరుసగా సినిమాల్లో నటిస్తూ డబుల్ సెంచరీ వైపు అడుగులు వేస్తూ చరిత్ర సృష్టించబోతున్నారు. నేడు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా `తుపాకి` శుభాకాంక్షలు.