Begin typing your search above and press return to search.

ఆస్పత్రిలో అలా చూడగానే ఏడ్చేసిన చిరంజీవి

By:  Tupaki Desk   |   24 May 2023 3:23 PM GMT
ఆస్పత్రిలో అలా చూడగానే ఏడ్చేసిన చిరంజీవి
X
ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సీనియర్ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన చనిపోవడానికి ముందు ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆయనను పరామర్శించేందుకు చిరంజీవి, నటి సుహాసిని వెళ్లారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడం విశేషం.

ఆరోజు తాము ఆస్పత్రిలో ఉన్న శరత్ బాబు పరామర్శించడానికి వెళ్లామని సుహాసిని చెప్పారు. ఆయన కళ్లు తెరిచి చిరంజీవి ని చూసి హాయ్ అని కూడా చెప్పారని, ఆయన అలా చెప్పగానే చింరజీవి కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆమె గుర్తు చేసుకున్నారు. ఆయనను అలా చూసి చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారని ఆమె అన్నారు. తామిద్దరం ఆస్పత్రిలో శరత్ బాబుతో చాలా ఎక్కువ సేపు గడిపినట్లు చెప్పారు.

రజినీకాంత్, కమల్ హాసన్ లతోకూడా శరత్ బాబు కి మంచి స్నేహం ఉందని సుహాసిని చెప్పారు. రజినీకాంత్ తో కలిసి శరత్ బాబు చాలా సినిమాలు నటించారని చెప్పారు. తమ సమకాలీన నటుడు ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆయనను పరామర్శించాల్సిన బాధ్యత మాకు ఉందని ఆమె చెప్పారు.

సుహాసిని శరత్‌బాబుతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాదు, వారిద్దరు మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఆయన మృతి ఆమెను ఎక్కువగా బాధించింది. ఆమెతో పాటు పలువురు సీనియర్ నటులు సైతం శరత్ బాబుతో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.

ఇదిలా ఉండగా, శరత్ బాబు తన 50 ఏళ్ల సినీ జీవితంలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ.. ఇలా చాలా భాషల్లో ఆయన నటించారు. ఆరోజుల్లో అన్ని భాషలను కవర్ చేసిన చాలా తక్కువ మంది నటుల్లో ఈయన కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన మృతి సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటున్నారు.