Begin typing your search above and press return to search.
కృష్ణవంశీకి చిరు ఫోన్ వచ్చింది..
By: Tupaki Desk | 22 Aug 2016 4:22 AM GMTమెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా స్టార్ట్ చేయకముందు.. చాలామంది దర్శకులనే పరిశీలించారు. అందులో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ పేరు కూడా ఉంది. అప్పట్లో సబ్జెక్ట్ కుదరక ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదు. కానీ ఇప్పుడు నేరుగా చిరు దగ్గర నుంచి తనకు ఫోన్ వచ్చేయడం కృష్ణవంశీని ఆశ్చర్యానికి గురిచేసింది.
అయితే.. చిరు ఇప్పుడు కృష్ణవంశీకి కాల్ చేసింది తన కోసం కాదు.. తన సినిమా కోసం అంత కంటే కాదు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తీస్తున్న నక్షత్రం సినిమా అప్ డేట్స్ అడిగి తెలుసుకునేందుకు మెగాస్టార్ ఈ కాల్ చేశారు. ఆ మూవీలో మెగా ఫ్యామిలీ నుంచి సాయిధరం తేజ్ నటిస్తుండడంతో.. నక్షత్రం గురించి.. అందులో తేజు రోల్ గురించి వాకబు చేశారు చిరు. మెగాస్టార్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తో సంతోషించిన క్రియేటివ్ డైరెక్టర్.. మొత్తం స్టోరీ అంతా పూసగుచ్చినట్లు వివరించేశారట.
మొత్తం అంతా విన్న తర్వాత చాలా సంతోషించిన చిరు.. కృష్ణవంశీని మనసారా అభినందించారట. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని.. బెస్టాఫ్ లక్ కూడా చెప్పారట. అంత పెద్ద స్టార్ స్వయంగా కాల్ చేసిన.. తనను అభినందించడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు కృష్ణవంశీ.