Begin typing your search above and press return to search.

చిరు వాయిస్.. ఏదో మ్యాజిక్ చేశారే

By:  Tupaki Desk   |   14 Dec 2017 12:59 PM GMT
చిరు వాయిస్.. ఏదో మ్యాజిక్ చేశారే
X
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ.. అందులో చిరు లుక్ కూడా బాగున్నప్పటికీ కొన్ని విషయాలు కొంత ఇబ్బందిగా అనిపించాయి. చిరంజీవి మునుపటి స్థాయిలో చురుగ్గా కనిపించలేదు. కొంచెం డల్లయ్యారు. మరోవైపు ఆయన వాయిస్ కొంచెం తేడాగా అనిపించింది. ‘పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది’ అంటూ ఆయన చెప్పిన డైలాగులో ఫోర్స్ లేకపోవడం గమనించవచ్చు. దాదాపు దశాబ్దం పాటు చిరు సినిమాలకు దూరంగా ఉండటం.. వయసు కొంచెం మీద పడటంతో ఆయన వాయిస్ లో తేడా వచ్చేసినట్లు అనిపించింది.

ఐతే ఇదే వాయిస్ తో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి సినిమా చేస్తే ఇబ్బంది తప్పదు. ఇలాంటి సినిమాలకు డైలాగులు కీలకం అవుతాయి. ఫెరోషియస్ క్యారెక్టర్లకు వాయిస్ తోనే ప్రాణం పోయాల్సి ఉంటుంది. పౌరుషంతో డైలాగులు చెప్పేటపుడు ఫోర్స్ లేకపోతే కష్టం. మొత్తం తేడా కొట్టేస్తుంది. ఈ నేపథ్యంలో చిరు వాయిస్ విషయంలో సందేహాలు వ్యక్తమయ్యాయి. ఐతే మధ్యలో ఏం మ్యాజిక్ చేశారో ఏంటో కానీ.. చిరు వాయిస్ లో ఇప్పుడు తేడా కనిపిస్తోంది. తాజాగా ‘తెర వెనుక దాసరి’ పుస్తకావిష్కరణలో చిరంజీవి ప్రసంగం వింటే ఆ విషయం అర్థమవుతుంది.

ఈ వేడుకలో చిరు దాదాపు పావు గంట పాటు అనర్గళంగా మాట్లాడారు. అప్పుడు ఆయన వాయిస్ చాలా గంభీరంగా వినిపించింది. ఎక్కడా తడబాటు లేదు. లో పిచ్‌ లో మాట్లాడినా కూడా వాయిస్ బలంగా అనిపించింది. మాటలో ఫోర్స్ కనిపించింది. ‘సైరా’ సినిమా కోసం ప్రిపరేషన్లో భాగంగా చిరు వాయిస్ మీద కూడా దృష్టిపెట్టి కసరత్తులేమైనా చేశారో లేదా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నారో తెలియదు కానీ.. చిరు వాయిస్ లో మార్పు మాత్రం స్పష్టం. ఇది ‘సైరా’ సినిమాకు ప్లస్సయ్యే అవకాశముంది.