Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీ పెద్ద‌..ఆ కిరీటం వ‌ద్దు బాబోయ్ అంటున్నారేంటీ?

By:  Tupaki Desk   |   31 Dec 2022 5:41 AM GMT
ఇండ‌స్ట్రీ పెద్ద‌..ఆ కిరీటం వ‌ద్దు బాబోయ్ అంటున్నారేంటీ?
X
టాలీవుడ్ ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు? అనే విష‌యంలో గ‌త కొంత కాలంగా హాట్ హాట్ చ‌ర్చ న‌డుస్తోంది. దీనిపై పెద్ద హోదాలో వున్న చాలా మంది కినుకు వ‌హిస్తుండ‌గా చిరంజీవి పెద్ద అనే పేరుని వాడ‌కుండా కార్మికుల‌కు అండ‌గా వుంటూ వ‌స్తున్నారు. అయితే ఇండ‌స్ట్రీ పెద్ద విష‌యంలో ర‌క ర‌కాల చ‌ర్చ జ‌రుగుతున్న వేళ చిరు మాత్రం ఇండ‌స్ట్రీ పెద్ద నాకు వ‌ద్దు బాబోయ్ అంటూ స్టేట్మెంట్ లు ఇస్తున్నారు. రీసెంట్ గా పెద్ద‌రికం అనుభ‌వించాల‌ని త‌న‌కు లేద‌ని, ఇంవ‌డ‌స్ట్రీలో త‌న‌కంటే పెద్ద వాళ్లు చాలా మందే వున్నార‌ని, సినీ కార్మికుల‌కు ఎప్పుడు ఏ స‌హాయం కావాల‌న్నా నేను స‌పోర్ట్ గా వుంటాను.

కార్మికుల‌కు అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా భుజం కాస్తా.. కోరుకున్న దానికంటే భ‌గ‌వంతుడు నాకు ఎక్కువే ఇచ్చాడు. న‌న్ను అంద‌రూ చిత్న ప‌రిశ్ర‌మ‌కు పెద్దోడు అంటున్నారు. పెద్ద‌రికం అనుభ‌వించాల‌ని నాకు లేదు. నా కంటే చాలా మంది పెద్ద‌లు వున్నారు. వాళ్లు చిన్న‌వాళ్లుగా చెప్పుకుంటూ న‌న్ను పెద్ద చేస్తున్నారు.

ఇది ఇటీవ‌ల ఓ సినీ కార్మికుల కార్య‌క్ర‌మంలో చిరంజీవి ఇండ‌స్ట్రీ పెద్ద అంశంపై చేసిన వ్యాఖ్య‌లు. కోవిడ్ టైమ్ లో కార్మికుల‌కు అండ‌గా నిలిచి ఫండ్ రైజ్ చేయించి సీసీసీ అంటూ చారిటీని ప్రారంభించి కార్మికుల కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు అందించ‌డంలో చిరంజీవి పెద్ద‌న్న పాత్ర పోషించారు.

ఆ త‌రువాత కార్మికుల‌కు ఇండ‌స్ట్రీలోకి చాలా వ‌ర‌కు ఆర్టిస్ట్ ల‌కు కూడా బ్ల‌డ్ బ్యాంక్ లోఉచితంగా కోవిడ్ టీకాలు వేయించ‌డంలో ప్రధాన పాత్ర పోషించారు చిరు. ఇంత చేస్తున్నా త‌న‌కు మాత్రం ఇండ‌స్ట్రీ పెద్ద అనే ట్యాగ్ వ‌ద్ద‌ని ఖ‌రా కండీగా చెప్పేస్తున్నారు. నా వంతు స‌హ‌కారం అందించ‌డానికి ఎప్పుడూ ముందుంటాన‌ని, ప‌రిశ్ర‌మ బిడ్డ‌గా ఉంటాన‌ని అంటున్నారే కానీ త‌న‌కు మాత్రం ఆ ట్యాగ్ వ‌ద్ద‌ని చెబుతున్నారు.

ఇక ఇదే త‌ర‌హాలో నిర్మాత‌ల తరుపున ప్ర‌ధాన పాత్ర పోషిస్తూ వ‌స్తున్న దిల్ రాజు నోట కూడా ఇవే మాట‌లు వినిపిస్తున్నాయి. షూటింగ్ ల బంద్‌, బ‌డ్జెట్ ల స‌మీక్ష , ఆర్టిస్ట్ ల రెమ్యున‌రేష‌న్ ల‌పై నిర్మాత‌ల‌ని స‌మీక‌రించి షూటింగ్ ల బంద్ ని విజ‌య‌వంతం చేసిన దిల్ రాజు 'ఇండ‌స్ట్రీ పెద్ద‌'గా ఆ ట్యాగ్ ని మాత్రం తీసుకోలేన‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ఇంత‌కీ ఇప్పుడు ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు? అనే చ‌ర్చ మొద‌లైంది. గ‌తంలో ఇండ‌స్ట్రీలో ఎలాంటి స‌మ‌స్య ఎదురైనా కార్మికులు, నిర్మాత‌ల‌కు స‌మ‌స్య‌లు వ‌చ్చినా దాస‌రి నారాయ‌ణ రావు గ‌డ‌ప తొక్కేవారు.

క్ష‌ణాల్లో స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేది. ఇండ‌స్ట్రీలో దాస‌రి మాట‌కు తిరుగుండేది కాదు. కానీ ఇప్పుడు అలాంటి పెద్ద ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఒక‌రు పెద్ద అంటే మ‌రో వ‌ర్గం ఈగోకు వెళ్లే అవ‌కాశం వుంది. ఇటీవ‌ల జ‌రిగిన 'మా' ఎన్నిక‌ల్లో ఇది స్ప‌ష్టంగా క‌నిపించింది. చిరు బ‌ల‌ప‌రిచిన వ్య‌క్తిని మోహ‌న్ బాబు కార‌ణంగా ఇండ‌స్ట్రీలోని చాలా మంది బ‌ల‌ప‌ర‌చ‌లేక‌పోయారు. లోన బ‌ల‌ప‌ర‌చాల‌ని వున్నా బ‌య‌టికి మాత్రం చెప్ప‌లేక‌పోయారు. ఈ సంఘ‌ట‌నే ఇప్పుడు ఇండ‌స్ట్రీ పెద్ద విష‌యంలో ఇబ్బందుల‌కు ప్ర‌ధాన కార‌ణంగా నిలిచిన‌ట్టుగా ఇన్ సైడ్ టాక్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.