Begin typing your search above and press return to search.
చిరు కత్తి పై మనసు పడ్డాడా?!
By: Tupaki Desk | 12 Aug 2015 4:28 AM GMTరీ ఎంట్రీ కోసం తహతహలాడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తన 150వ చిత్రం కోసం ఎప్పట్నుంచో కథలు వింటున్నాడు. ఇప్పటికే వందల కథలు వినుంటాడు. స్టార్ డైరెక్టర్లు, స్టార్ రైటర్లు కథలు చెప్పుంటారు. కానీ ఎవరూ చిరుని ఒప్పించలేకపోయారు. పూరి చెప్పిన `ఆటోజానీ` కథ మాత్రం సగం నచ్చింది. మరో సగం చేయమంటే వేరే సినిమాతో బిజీ అయిపోయాడు పూరి. మరి చిరు రీ ఎంట్రీ సినిమా సంగతేంటి? పోయిన బర్త్‌డే కే సినిమాని ప్రకటించాలనుకొన్నాడు. కానీ కుదర్లేదు.
మరో పది రోజుల్లో ఇంకో బర్త్ డే కూడా వస్తోంది. కానీ కథ మాత్రం సిద్ధం కాలేదు. ఆ విషయంలోనే చిరు కాస్త ఆలోచనలో పడ్డాడట. అయితే ఇటీవలే ఎవరో వచ్చి `కత్తి` సినిమా చూడమని చిరుకి చెప్పారట. తమిళంలో విజయ్ కథానాయకుడిగా నటించిన `కత్తి` సినిమాని చూసిన చిరుకి చాలా బాగా నచ్చిందట. మురుగదాస్ తీసిన ఈ సినిమాని రీమేక్ చేస్తే ఎలా ఉంటుందా? అని ఇప్పుడు చిరు తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
`కత్తి` సినిమాని తెలుగులో రీమేక్ చేయడం గురించి చాలా మంది కథానాయకులు ఆలోచించారు. మొదట ఎన్టీఆర్ అన్నారు. ఆ తర్వాత పవన్ అన్నారు. మహేష్ బాబు పేరు కూడా వినిపించింది. కానీ వాళ్లెవరూ ఆ సినిమాని చేయలేకపోయారు. ఇప్పుడు చిరు మాత్రం తన ఇమేజ్‌కి తగ్గట్టుగా కథలో కాసిన్ని మార్పులు చేస్తే బాగానే ఉంటుందని అభిప్రాయపడుతున్నాడట. అంతా పక్కా అనుకొన్నాక మురుగదాస్ కి కబురు పెట్టి కథలో మార్పులు చేయించొచ్చని సమాచారం. ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ తెరకెక్కించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మురుగదాస్ ఇదివరకు తమిళంలో తీసిన `రమణ` సినిమాని వినాయకే చిరుతో `ఠాగూర్`గా తీసి హిట్టు కొట్టాడు. సో... `కత్తి`ని కూడా వినాయక్ డీల్ చేస్తేనే బాగుంటుందని చిరు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది.