Begin typing your search above and press return to search.

హిట్లర్ హిస్టరీని చిరు రిపీట్ చేస్తాడా?

By:  Tupaki Desk   |   19 Nov 2015 10:30 PM GMT
హిట్లర్ హిస్టరీని చిరు రిపీట్ చేస్తాడా?
X
కోలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ వేదాలంను మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయనున్నారనే వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీని ఆయన చూశారో, చూస్తారో ఇంకా చెప్పలేం కానీ.. చిరు రీ ఎంట్రీ కోసం వేదాలంను పరిశీలించడం మాత్రం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయిపోయింది. ముఖ్యంగా ఇది సిస్టర్ సెంటిమెంట్ మూవీ కావడమే.. అసలు విషయం.

ఓ రెండు దశాబ్దాల క్రితం.. చిరు కెరీర్ లో పెద్ద బ్రేక్ వచ్చింది. అప్పుడు ఆచితూచి 18నెలలు ఎదురుచూసి, హిట్లర్ చేశారు చిరంజీవి. ఇది దాదాపు రీఎంట్రీ అనే చెప్పాలి. మళయాళ హిట్లర్ ని తెలుగులో రీమేక్ చేశారు అప్పట్లో. ఇందులో చిరు పాత్రకు ఏకంగా ఏడుగురు చెల్లెళ్లు ఉంటారు. అంతగా సిస్టర్ సెంటిమెంటల్ రోల్ ఇది. ఇప్పుడు వేదాలంకూడా చెల్లెలి సెంటిమెంట్ తో నడిచే సినిమానే కావడం విశేషం. ఇప్పటికైతే ఇదే మూవీతో రీఎంట్రీ ఇస్తారని చెప్పలేం కానీ.. చేస్తే మాత్రం హిట్లర్ హిస్టరీని రిపీట్ చేసినట్లే.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ మూవీ పై ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాడు. నిజానికి యంగ్ టైగర్ కి కూడా ఈ సిస్టర్ సెంటిమెంట్ అచ్చొచ్చిన పాత్రే. రాఖీ మూవీతో తెలుగు ఆడపడుచులు అందరికీ అన్నయ్య అయిపోయాడు కొన్నేళ్ల క్రితం. అదే కాకుండా ఎన్టీఆర్ మూవీస్ లో ఎక్కువగా కామన్ కనిపించే ఎలిమెంట్ ఇది. అందుకే జూనియర్ కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు టాక్. మరి ఈ ఇద్దరిలో వేదాలం చెల్లెలి సెంటిమెంట్ ని పండించేదెవరో ?