Begin typing your search above and press return to search.
చిరు చిన్న కూతురు కూడా వచ్చేస్తోందిట
By: Tupaki Desk | 27 Jun 2016 6:15 AM GMTమెగా వారసులుగా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వెలిగిపోతున్నారు. ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగిలినవారుపెద్ద హీరోలుగా ఎదిగారు.. ఎదుగుతున్నారు కూడా. ఇప్పటివరకూ అబ్బాయిల రంగ ప్రవేశం అయితే.. ఇప్పుడు మెగా వారసులుగా అమ్మాయిలు పరిశ్రమలోకి వస్తున్నారు. రీసెంట్ గా నాగేంద్రబాబు కూతురు నీహారిక.. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.
మెగా డాటర్ నీహారికకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆమె తల్లి పద్మజ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి కుమార్తెలు కూడా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తున్నారు. మెగాస్టార్ 150వ సినిమా కత్తిలాంటోడు మూవీలో చిరుకు కాస్ట్యూమ్ డిజైన్ చేసినది ఆయన పెద్ద కూతురు సుశ్మితనే. ఇప్పుడు మెగాస్టార్ చిన్న కూతురు కూడా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేస్తోంది. అయితే.. ఈమె యాక్టర్ గా కాదు.. అలాగని అక్కలా ఫ్యాషన్ డిజైనింగ్ వైపు కూడా కాకుండా.. మరో విభాగంలోకి ప్రవేశించనుందని తెలుస్తోంది.
ప్రొడక్షన్ విభాగం వైపు చిరు డాటర్ శ్రీజ అడుగులు పడుతున్నాయని సమాచారం. రజినీకాంత్ కూతుళ్లు - అశ్వనీదత్ కుమార్తె మాదిరిగా సినీ నిర్మాణంలో భాగం కానుందిట. మొదట లో బడ్జెట్ సినిమాలతో ప్రారంభించి.. క్రమంగా భారీ చిత్రాల వైపు అడుగులు వేయనుందని తెలుస్తోంది. చిరు కుటుంబంలోంచి మరో వారసురాలు సినీ రంగం వైపు వస్తున్నట్లు ఫిక్స్ అయిపోవచ్చు.