Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: `చిరు`తనయలు సందడే సందడి
By: Tupaki Desk | 12 March 2021 5:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. వారసురాళ్లు కూడా సినీరంగానికే సేవలందిస్తున్నారు. చిరు పెద్ద కుమార్తె సుశ్మిత కొణిదెల ఇప్పటికే ఫ్యాషన్ (కాస్ట్యూమ్స్) డిజైనర్ గా రాణిస్తున్నారు. మెగాస్టార్ నటించే సినిమాలతో పాటు సోదరుడు రామ్ చరణ్ సినిమాలకు కాస్ట్యూమ్స్ అందిస్తున్నారు.
అలాగే వెబ్ సిరీస్ లతో నిర్మాతగానూ సుశ్మిత కొత్త ప్రయత్నం తెలిసిందే. మరోవైపు శ్రీజ కూడా సినీనిర్మాతగా తొలి అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక అక్కాచెల్లెళ్ల అనుబంధం అన్యోన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే.
మహాశివరాత్రి ఫర్వదినాన్ని పురస్కరించుకుని ఇదిగో ఇలా సరికొత్తగా తమని తాము మెగా డాటర్స్ ఆవిష్కరించుకున్నారు. భక్తి శ్రద్ధలతో పూజల అనంరం ఇలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. చీరలో ఎంతో సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే.. షేడెడ్ గ్లాసెస్ ధరించి పోష్ లుక్ ని ఎలివేట్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం మెగాభిమానుల్లో ఈ ఫోటో వైరల్ గా మారింది.