Begin typing your search above and press return to search.
ఖైదీకి కత్తెర వెయ్యొద్దని చెప్పేశారా?
By: Tupaki Desk | 3 Jan 2017 5:29 AM GMTఖైదీ నంబర్ 150.. చిరంజీవి కంబ్యాక్ మూవీ కావడంతో టాలీవుడ్ ఈ మూవీపై అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోంది. టీజర్.. ఆడియో సాంగ్స్ తోనే బోలెడంత హైప్ క్రియేట్ కాగా.. చిరంజీవి రీఎంట్రీ అన్నదే ఈ మూవీకి కీలకమైన పాయింట్. ఖైదీకి ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసేయగా.. ఫైనల్ కట్ 2 గంటల 30 నిమిషాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తత ట్రెండ్ ప్రకారం ఈ డ్యురేషన్ కొంచెం తగ్గించాలని భావించారట నిర్మాత రామ్ చరణ్.. దర్శకుడు వివి వినాయక్. కానీ ఫైనల్ కట్ చూసిన చిరంజీవి మాత్రం.. ఎలాంటి కోతలు అవసరం లేదని.. మొత్తం యాజ్ ఇటీజ్ గా ఉంచేయమని సూచించారట. మెగాస్టార్ మాటలతో తమ ప్రయత్నాలు విరమించుకున్నారట దర్శక నిర్మాతలు. ముఖ్యంగా.. మాస్ పల్స్ బాగా తెలిసిన వినాయక్ డైరెక్షన్ లో రూపొందిన యాక్షన్.. ఎంటర్టెయినింగ్ సన్నివేశాలు సూపర్బ్ గా వచ్చాయని తెలుస్తోంది. ఒకవేళ కోత వేస్తే వీటి దగ్గరే పడే అవకాశాలుంటాయనే.. కంప్లీట్ గా రిలీజ్ చేసేయమని చెప్పారట చిరు.
దీంతో పాటు ట్రైలర్ విషయంలో కూడా చిరంజీవి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట. సరిగ్గా మూవీ రిలీజ్ కి 4 రోజుల ముందు అంటే ఈ నెల 7న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. దీన్ని ఎక్స్ ట్రార్డినరీగా ఉండేలా కట్ చేసి.. ఏమైనా నెగిటివ్ హైప్ లాంటివి ఉంటే.. వాటిని తుడిచిపెట్టేయాలని ఫిక్స్ అయ్యారట మెగాస్టార్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/