Begin typing your search above and press return to search.
వీరయ్య వెన్యూ షిఫ్టింగ్ వారి సౌలభ్యం మేరకు..!
By: Tupaki Desk | 8 Jan 2023 8:44 AM GMTఈరోజు సాయంత్రం విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ గ్రౌడ్స్‌లో వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యేందుకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా.. ఎయిర్ పోర్ట్ లో మీడియా తనను ప్రశ్నించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ మార్పు అంశంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని.. వారి(ప్రభుత్వాధికారులు-పోలీసులు) సౌలభ్యం మేరకు అనుమతి ఇస్తారని వ్యాఖ్యానించారు.
వాల్తేరు వీరయ్యతో సినీ ప్రేమికుల అంచనాలను అందుకుంటామని మెగాస్టార్ అన్నారు. ఆర్కే బీచ్ లో వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరించిన ఏపీ పోలీసులు ఏయూ (ఆంధ్రా యూనివర్శిటీ) గ్రౌండ్స్‌లో నిర్వహించాలని కోరిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆర్కే బీచ్ కు అనుమతి ఇచ్చినా ఆ తర్వాత జీవో1 విడుదలైంది. పోలీస్ అధికారుల నియమావళి ప్రకారం బీచ్ లో కాకుండా ఇప్పుడు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు.
ఈ వ్యవహారం పైన తాను స్పందించనని తొలుత చెప్పిన చిరంజీవి.. అక్కడి పరిస్థితులకు అనుగుణం అధికారులు నిర్ణయం తీసుకుంటారని పరోక్షంగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించడం ఆసక్తికరం. మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా విమానాశ్రయంలో కనిపించారు. వీరయ్య చిత్రబృందం ఈవెంట్ కోసం సర్వసన్నాహకాల్లో ఉంది.
వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ఒంగోలులో భారీగా నందమూరి అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. అదే తీరుగా ఇప్పుడు విశాఖలోను వేలాదిగా అభిమానుల సమక్షంలో వైభవంగా ఈవెంట్ ని నిర్వహించేందుకు మైత్రి సంస్థ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర మెగాభిమానుల్లో పూనకాలు ఒక రేంజులో ఉన్నాయి. ఈవెంట్ వద్ద ఊక వేస్తే రాలనంత మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మెగాభిమానులు భారీ ఎత్తున ఏయు గ్రౌండ్స్ కి చేరుకోవడం కనిపిస్తోంది. వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో పందెం పుంజులా బరిలో దిగుతున్నాడు. జనవరి 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదల కానుంది.
అంచనాలు పెంచిన ట్రైలర్
వాల్తేరు వీరయ్య ట్రైలర్ ప్రీరిలీజ్ కి ఒకరోజు ముందే విడుదల కాగా వెబ్ లో సునామీలా దూసుకెళ్లింది. మెగా ఫ్యాన్స్ క్లిక్ లు లైక్ లతో హోరెత్తించారు. సినిమా ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్ చిరు- శ్రుతి నడుమ కామెడీ సన్నివేశాలు రొమాన్స్ రసపట్టు మీద సాగాయని ట్రైలర్ భరోసానిచ్చింది. ఇక ఈ ట్రైలర్ లో మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ మరో హైలైట్. అతడి ఎంట్రీనే ఇరగదీశాడు. వైజాగ్ సిటీలో మాఫియా అరాచకాల్ని ఆపేందుకు వచ్చే పోలీస్ కమీషనర్ గా రవితేజ కనిపించారు. అయితే ఒకానొక దశలో చిరు-రవితేజ ఇద్దరి మధ్యా ఉన్న సాన్నిహిత్యాన్ని ట్రైలర్ లో చూపించడంతో ఫ్యాన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ సినిమాలో వీరయ్యగా అండర్ కాప్ పాత్రలో మెగాస్టార్ మెరిపించబోతున్నారన్న గుసగుసా వేడెక్కించేస్తోంది.