Begin typing your search above and press return to search.
ఆ షాట్ డైరక్షన్ చేసిన మెగాస్టార్ చిరు
By: Tupaki Desk | 13 Dec 2016 3:46 PM GMTమెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీకి షూటింగ్ పూర్తయిపోయింది. తాజాగా ఓ మాస్ సాంగ్ షూటింగ్ ను చేసిన ఖైదీ యూనిట్.. ప్యాచ్ వర్క్ తో పూర్తి చేసేశారు. చివరగా చిత్రీకరించిన పాటలోనే రామ్ చరణ్ కూడా స్టెప్పులేయగా.. తన డ్యాన్సింగ్ స్టైల్ ని మొత్తం మార్చేశారంటూ కాజల్ అగర్వాల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.
ఇప్పుడు ఖైదీ షూటింగ్ పూర్తయిపోయిన విషయాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధికారికంగా ప్రకటించడమే కాదు.. చివరి షాట్ కు సంబంధించిన ఓ వీడియోను కూడా యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. 'ఖైదీ నెంబర్ 150 షూటింగ్ ని చాలా ఫన్నీగా ముగించాం. ఆఖరి షాట్ ని దర్శకుడు వివి వినాయక్ పై మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వంలో రూపొందించాం' అంటూ ట్వీట్ చేయడమే కాదు.. యాక్షన్ అంటూ చిరంజీవి మెగాఫోన్ పట్టుకుని దర్శకుడు వినాయక్ కు యాక్షన్ చెబుతున్న షాట్ అదిరిపోయింది.
ముఠా మేస్త్రి టైప్ లో వినాయక్ గెటప్ కూడా డిఫరెంట్ గా ఉంది. చివరకు ఒకరికి ఒకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటూ షూటింగ్ పూర్తయిపోయిన సంగతిని అధికారికంగా వెల్లడించారు నిర్మాతలు. షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేశారు కాబట్టి.. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగం పుంజుకోవడం ఖాయం. మరి జనవరి 11న మెగా సందడికి సిద్ధమయిపోతున్నారా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/