Begin typing your search above and press return to search.
చిరును తమ్ముళ్లు ఇద్దరూ నిరాశపరిచారే
By: Tupaki Desk | 8 Jan 2017 9:27 AM GMTతొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ ముఖానికి రంగేసుకొని కెమేరా ముందుకు వచ్చేశారు. ఈ మూమెంట్ కోసం తాను ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేశానని.. అన్నయ్య సినిమాకు ఓకే చెప్పగానే తాను తెగ ఇదైపోయిన విషయాన్ని ఉద్వేగంగా చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. నిజానికి ఇలాంటి ఉద్వేగం బన్నీకే కాదు.. మెగాస్టార్ ను అభిమానించే అందరికీ ఉంటుంది.
తన మైల్ స్టోన్ మూవీ అయిన ఖైదీ చిత్రానికి ఎంత హైప్ తీసుకురావాలో అంతకు మించిన హైప్ తీసుకురావటంలో చరణ్ సక్సెస్ అయ్యారు. సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ డేట్ డిసైడ్ చేసే వరకూ సినిమాకు లభించిన ప్రచారం భారీగానే ఉందని చెప్పాలి. అది కూడా సరిపోలేదని మెగా క్యాంప్ ఫీల్ అవుతున్న వేళ.. అలాంటి సెట్ బ్యాక్స్ ఏమైనా ఉంటే మొత్తంగా సెట్ చేసేద్దామని ప్రీరిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేశారు.
ఈ కార్యక్రమంతో సినిమా గురించి అందరూ చర్చించుకునేలా చేసి.. రిలీజ్ డేట్ కోసం తపించిపోయేలా చేయాలని భావించారు. ఇందుకోసం అల్లుఅరవింద్ స్వయంగా రంగంలోకి దిగి.. ఫంక్షన్ ఏర్పాట్లు దగ్గరుండి చేయించారు. ఫంక్షన్ కు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. ఈ కార్యక్రమానికి పవన్ వస్తారా? లేదా? అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. దీనిపై రకరకాల వాదనలు.. అంచనాలు వినిపించినా.. చివర్లో తానీ ఫంక్షన్ కు రావటం లేదన్న విషయాన్ని ఒక్కమాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఒక ట్వీట్ తో తేల్చేశారు పవన్.
అన్నయ్యకు మైల్ స్టోన్ సినిమా ఫంక్షన్ కు పవర్ స్టార్ వస్తే.. ఆ ఊపే వేరుగా ఉంటుందని భావించినా.. అలాంటిదేమీ జరగకపోవటంతో మెగా క్యాంప్ కాసింత నిరాశ పడింది. దాన్ని భర్తీ చేస్తూ.. మిగిలిన మెగా క్యాంప్ హీరోలంతా వేదికను అక్యూపై చేసి కొత్తకళను తీసుకురావటానికి ఎవరి ప్రయత్నం వారు చేశారు. అంతా బాగుంది.. అనుకున్నట్లే జరుగుతుందన్న వేళ.. మెగా అభిమానులు చేసిన హడావుడితో కార్యక్రమాన్ని తొందరగా ముగించాలంటూ ఏపీ పోలీస్ నుంచి ఆదేశాలు రావటం ఒక మైనస్ అయితే.. చరణ్ మీద.. చిరు మీద విమర్శలు చేశారంటూ మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేయటం.. ఛండాలంగా తిట్టేయటంతో.. గ్రాండ్ గా జరగాల్సిన ఫంక్షన్ మరో రూట్ లోకి వెళ్లిపోయింది. సినిమా ఫంక్షన్ పూర్తి అయ్యాక.. సినిమా ట్రైలర్ గురించి.. సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన స్థానే.. నాగబాబు చేసిన విమర్శలు.. దానికి యండమూరి ఇచ్చిన కూల్ రిటార్ట్ ఒక ఎత్తు అయితే.. ఎడాపెడా వాయించేలా వర్మ చేసిన ట్వీట్లతో.. అందరూ ఆ విషయాన్ని మరింత భారీగా కవర్ చేసిన పరిస్థితి. దీంతో.. అసలు పోయి కొసరు మిగిలిన పరిస్థితి. అంతేనా.. ఒక తమ్ముడు మౌనంగా ఉండి దెబ్బేస్తే.. మరో తమ్ముడు మాట్లాడి ఫంక్షన్ కు ఊహించని రీతిలో దెబ్బేశాడన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. పండగలా చేసుకోవాల్సిన కార్యక్రమంలో కాంట్రావర్సీ ఇష్యూలను టచ్ చేయాల్సిన అవసరం ఏమిటో..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/