Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ముందు వీరులంతా ఉఫ్‌!

By:  Tupaki Desk   |   3 Oct 2019 2:30 PM GMT
మెగాస్టార్ ముందు వీరులంతా ఉఫ్‌!
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా- న‌ర‌సింహారెడ్డి`పై కామ‌న్ ఆడియెన్ పాజిటివ్ స్పంద‌న‌లు.. రియాక్ష‌న్లు చూస్తున్న‌వే. దీంతో పాటే క్రిటిక్స్ కోణంలో పాజిటివిటీ ఉన్నా.. ప‌లు ర‌కాలుగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ అంశాల తాళింపు కోసం చ‌రిత్ర‌లో ఉన్న‌దానిని ఎగ్జాగ‌రేట్ చేశారన్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మ‌సాలా చిత్రంగా తీర్చిదిద్ద‌డం కోసం పాత్ర‌ల్ని.. పాత్ర‌ధారుల్ని అలా హెచ్చు స్థాయిలో చూపించార‌ని నేచురాలిటీకి దూరంగా క‌నిపించిన పాత్ర‌లు ఉన్నాయ‌ని విమ‌ర్శించారు.

ఇదొక్క‌టే కాదు మెగాస్టార్ మేనియా ముందు ఇత‌ర పాత్ర‌ధారులు తేలిపోయార‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. సినిమాని నిశితంగా ప‌రిశోధిస్తే.. ఇందులో ఇత‌ర భాష‌ల స్టార్ల‌కు ఉన్న ప్రాధాన్య‌త అంతంత మాత్ర‌మే. ఆయా పాత్ర‌లు కేవలం స‌పోర్టింగ్ గా మాత్ర‌మే క‌నిపిస్తాయి.. కానీ పూర్తి ప్ర‌భావ‌వంతంగా క‌నిపించ‌వు. అవుకురాజు పాత్ర‌లో సుదీప్ కి కొంత ప్రాధాన్య‌త‌నిచ్చినా గోసాయి వెంక‌న్న‌ అమితాబ్ పాత్ర కానీ.. త‌మిళ వీరుడుగా విజ‌య్ సేతుప‌తి పాత్ర కానీ మ‌రీ అంత లెంగ్త్ ప‌రంగా ప్ర‌భావవంతంగా అనిపించ‌వు. సినిమా ఆద్యంతం మెగాస్టార్ మేనియా ముందు ఇత‌ర స్టార్లు ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డం కూడా ఓ ప్రాబ్లెమ్ అని చెబుతున్నారు.

అయితే ఇవేవీ తెలుగు రాష్ట్రాల వ‌ర‌కూ ప్ర‌భావితం చేయ‌క‌పోయినా.. ఇరుగు పొరుగు భాష‌ల్లో వ‌సూళ్ల ప‌రంగా ప్ర‌భావితం చేస్తాయా అంటూ డిస్క‌ష‌న్ సాగుతోంది. అయితే ప్ర‌తిపాత్ర‌ను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళితే ప్ర‌తి పాత్ర‌కు ఒక సినిమా అవ‌స‌రం అవుతుంద‌ని చెబుతూ.. ద‌ర్శ‌కుడు సూరి క‌న్విన్స్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కోసం ఓ పాత్ర‌ను క‌లుపుకుని దానిని ఎన్ లార్జ్ చేయాల‌నుకున్నా త‌ర్వాత ఆ ప్ర‌య‌త్నం విర‌మించుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. పాత్ర‌ల నిడివి క‌నెక్ట‌వ్వ‌క‌పోయినా ఎమోష‌న్ క‌నెక్ట‌యితే జ‌నాల ఆద‌ర‌ణ త‌గ్గ‌ద‌ని గ‌తంలో ప్రూవైంది. మ‌రి సైరాను అదే ఇరుగు పొరుగు భాష‌ల్లో ఆదుకుంటుందా? అన్న‌ది చూడాలి.