Begin typing your search above and press return to search.

మెగా డ్రీమ్‌ నెరవేరలేదని ఫీలయ్యారు

By:  Tupaki Desk   |   8 Sep 2015 12:06 PM GMT
మెగా డ్రీమ్‌ నెరవేరలేదని ఫీలయ్యారు
X
మెగాస్టార్‌ చిరంజీవి కీర్తికిరీటంలో ఎన్నో మైలు రాళ్లు. రకరకాల క్యారెక్టర్ లలో ఆయన అభినివేషం తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధం చేసింది. గ్యాంగ్‌ లీడర్‌ గా - రౌడీ అల్లుడుగా - ఘరానా మొగుడుగా - ఇంద్రగా .. ఒకటేమిటి? అతడి కెరీర్‌లో ఒక్కో క్యారెక్టర్‌ ఒక్కో ఆణిముత్యం. అభిలాష - ఛాలెంజ్‌ - ఖైదీ నంబర్‌ 786 ఇలా చెప్పుకోదగ్గ సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు మెగాస్టార్‌. తెలుగు సినిమా స్టామినాని పీక్స్‌ కి తీసుకెళ్లిన కమర్షియల్‌ హీరో చిరంజీవి.

అయితే ఇంతటి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్నా చిరంజీవికి క్యారెక్టర్ ల పరంగా ఇంకేదైనా వెలితి ఉందా? ఫలానా క్యారెక్టర్‌ లో చేయలేకపోయాను.. అని భావించిన సందర్భాలున్నాయా? అన్న ప్రశ్న వేస్తే.. అవుననే అన్నారాయన. నా కెరీర్‌ లో ఎన్నో రకాల పాత్రల్లో కనిపించినా 'భగత్‌ సింగ్‌'గా కనిపించాలన్న కోరిక నెరవేరనేలేదు. అందుకే ఏదో ఒకనాడు నేను దేశభక్తుని పాత్రలో నటించాలనుకుంటున్నా. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర లాంటివి చేస్తానని అన్నారు. అది 151వ సినిమా కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు.. అని క్లూ ఇచ్చారు ఓ ఇంటర్వ్యూ లో. ఇప్పటికైతే 150వ సినిమా అప్‌ డేట్‌ రావాల్సి ఉందింకా. పూరీ వినిపించిన ఆటోజానీ కథ ఫైనల్‌ కాలేదు.

నిజానికి 150వ సినిమాను ఒక మెసేజ్‌ ఓరియెంటెండ్‌ సినిమాగా చేస్తారేమో అనుకుంటే.. అబ్బే కాదు.. నాకు మెసేజ్‌ లు ఇవ్వడం ఇష్టం లేదు, కేవలం ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్ టైన్ మెంట్ ఉన్న సినిమానే చేయాలని ఉంది అంటూ ఆ పాయింట్‌ కూడా చెప్పేశారు.