Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : లాక్‌ డౌన్‌ తో చిరు ఇలా టైమ్ పాస్

By:  Tupaki Desk   |   27 March 2020 8:31 AM GMT
ఫొటోటాక్‌ : లాక్‌ డౌన్‌ తో చిరు ఇలా టైమ్ పాస్
X
మెగాస్టార్‌ చిరంజీవి లాక్‌ డౌన్‌ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. లాక్‌ డౌన్‌ కు ముందే తన ఆచార్య షూటింగ్‌ ను క్యాన్సిల్‌ చేసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కరోనా కారణంగా విధించిన లాక్‌ డౌన్‌ తో పూర్తిగా ఇంట్లోనే ఉంటున్నారు. తాజాగా ఉగాది కానుకగా సోషల్‌ మీడియాలో ఎంటర్‌ అయిన మెగాస్టార్‌ వరుసగా ట్వీట్స్‌.. పోస్ట్‌ లు పెడుతూ వస్తున్నాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మెగాస్టార్‌ పోస్ట్‌ లు తెగ వైరల్‌ అవుతున్నాయి.

మెగాస్టార్‌ చిరంజీవి కేవలం ఇంట్లో వారితో గడపడమే కాకుండా మొక్కలకు నీళ్లు పోడం వంటివి చేస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం మొక్కలకు నీళ్లు పోస్తానంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఈ ఫొటోను చిరంజీవి ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేశాడు. దీంతో పాటు మొక్కే కదా అని వదిలేస్తే... అంటూ తన ఇంద్ర సినిమాలోని డైలాగ్‌ను కూడా పోస్ట్‌ చేశాడు. మొత్తానికి చిరంజీవి సోషల్‌ మీడియాలో ఏ స్థాయిలో యాక్టివ్‌ గా ఉన్నాడో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

ట్విట్టర్‌ ఇన్‌ స్టాగ్రామ్‌ లోనే కాకుండా ఇలా తన టైం ను చెట్లకు నీళ్లు పోస్తూ కూడా గడుపుతున్నట్లుగా చిరంజీవి ఈ ఫొటోతో చెప్పకనే చెప్పాడు. సెలబ్రెటీలు అంతా కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ టైం పాస్‌ చేస్తున్నారు. ఎప్పుడు కూడా బిజీ బిజీగా గడిపే సెలబ్రెటీలు ఇప్పుడు ఇలా ఉండేందుకు కాస్త ఇబ్బంది పడుతున్నారట. అయినా కూడా కరోనా భయంతో తప్పలేదని అంటున్నారు.