Begin typing your search above and press return to search.
చిరు అభిమానుల్లో టెన్షన్
By: Tupaki Desk | 14 Oct 2022 12:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి రేంజికి ఆయన ఎంచుకుంటున్న సినిమాలు ఏమాత్రం సరితూగడం లేదనే ఆవేదన అభిమానుల్లో చాన్నాళ్ల నుంచి ఉంది. ఇటీవల విడుదలైన 'గాడ్ ఫాదర్'తో పాటు తర్వాత ఆయన చేస్తున్న రెండు చిత్రాల విషయంలోనూ వారు అసంతృప్తిగానే ఉన్నారు. 'వాల్తేర్ వీరయ్య' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న బాబీ ట్రాక్ రికార్డు ఏమంత గొప్పగా లేదన్న విషయం తెలిసిందే.
అతడి విషయంలోనే అంత సంతృప్తిగా లేరంటే ఇక మెహర్ రమేష్ లాంటి ఘోరమైన ట్రాక్ రికార్డున్న దర్శకుడితో సినిమా విషయంలో అభిమానుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
తీసిన రెండు సినిమాలతో హిట్లు కొట్టినప్పటికీ వెంకీ కుడుములతో చేయబోతున్న సినిమాల విషయంలోనూ కొన్ని అభ్యంతరాలున్నాయి. చిరు రేంజికి తగ్గ దర్శకుడతను కాదన్నది అభిమానుల మాట.
చిరు రేంజికి సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి ఫాంలో ఉన్న టాప్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలన్నది అభిమానుల ఆకాంక్ష. భవిష్యత్తులో అయినా ఈ కాంబినేషన్లు సెట్ అవుతాయేమో అని ఎదురు చూస్తుంటే.. తాజాగా పూరి జగన్నాథ్‌కు చిరు కమిట్మెంట్ ఇవ్వడం అభిమానులకు రుచించడం లేదు. 'గాడ్ ఫాదర్' ప్రమోషన్లలో భాగంగా పూరితో చిరు తాజాగా ఆన్ లైన్ చిట్ చాట్ చేశాడు.
ఈ సందర్భంగా తన కోసం గతంలో రెడీ చేసిన 'ఆటోజానీ' స్క్రిప్టు ఏమైందని అడిగితే.. దాన్ని పక్కన పెట్టేసి కొత్త కథతో వస్తానని పూరి చెప్పాడు. మీరు ఎప్పుడు వచ్చినా మోస్ట్ వెల్కం, మనం కచ్చితంగా సినిమా చేద్దాం అని చిరు అన్నాడు. పూరి కూడా చాలా ఉత్సాహంగా త్వరలోనే మంచి కథతో మీ దగ్గరికి వస్తాను అన్నాడు.
ఐతే ఊరికే మాట వరసకు ఇద్దరి మధ్య ఈ సంభాషణ జరిగితే ఓకే కానీ.. నిజంగా పూరితో చిరు సినిమా చేసేస్తాడేమో అని అభిమానులు కంగారు పడుతున్నారు. 'లైగర్' సినిమా చూశాక పూరితో సినిమా అంటే ఏ హీరో అభిమానులైనా కంగారు పడతారు. చిరు అభిమానులు కూడా అందుకు మినహాయింపు కాదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.