Begin typing your search above and press return to search.
ఈ మార్ఫ్‌డ్ ప్రచారం ఏంటీ గురూ?
By: Tupaki Desk | 11 Jan 2017 5:31 AM GMTమెగాస్టార్ చిరంజీవి దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. చిరు తాజా చిత్రం ఖైదీ నెంబరు 150 నేటి ఉదయం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 9 ఏళ్ల విరామం తర్వాత అది కూడా తన 150వ చిత్రంగా వస్తున్న చిరు చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంక్రాంతి బరికి ఆయన ఏకంగా నందమూరి బాలకృష్ణ వందో చిత్రానికి దాదాపుగా పోటీకి దిగుతున్నట్లే ఉంది. బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శతకర్ణి కూడా రేపు విడుదల కానుంది. నేటి ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు చిత్రానికి పాజిటివ్ టాకే వినిపిస్తోంది.
అయితే ఈ చిత్రాన్ని మెగా సక్సెస్ చేసేందుకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క మార్గాన్ని కూడా చిరు ఫ్యాన్స్ వదలడం లేదు. ఈ క్రమంలో అసలుకే ఎసరు తెచ్చే ఓ పని కూడా జరిగిపోయినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల టాలీవుడ్ చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి బిజినేస్సే జరుగుతోంది. ఈ క్రమంలో ఇక్కడ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేదానికంటే ఓ రోజు ముందుగానే అమెరికాలో ఆ చిత్రాలు రిలీజైపోతున్నాయి. ప్రీమియర్ షోల పేరిట ఏర్పాటవుతున్న సదరు షోలను చూసేందుకు అక్కడి ప్రవాసాంధ్రులు ఎగబడుతున్నారు. ఇక చిరు చిత్రం అయితే... మరింత క్రేజీ కనిపిస్తుందిగా. ఇదే అంశాన్ని ఆసరా చేసుకుని చిరు ఫ్యాన్స్ ఓ గిమ్మిక్కు చేశారు.
అమెరికాలోని ఓ ప్రాంతంలో ఏదో కారణం చేత ట్రాఫిక్ జామైతే... అది ఖైదీ నెంబరు 150 ప్రీమియర్ షో కారణంగా జరిగినట్లుగా చిత్రీకరించిన కొందరు వ్యక్తులు సదరు ఫొటోను - ట్రాఫిక్ జామైన కారణాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ను పెట్టేశారు. అయితే ఈ కథనం తప్పుడుదేనంటూ వెనువెంటనే మరో కథనం కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైపోయింది. ఏదో కారణం చేత ట్రాఫిక్ జామైతే... దానిని చిరు ఫ్యాన్స్ మార్ఫ్ చేసి... ఖైదీ చిత్రం ప్రీమియర్ కారణంగానే ట్రాఫిక్ జామైందంటూ కథనాలు రాశారని రెండో కథనం సారాంశం. ఈ రెండు ఫొటోలతో కూడిన కథనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/