Begin typing your search above and press return to search.

చిరు నిజమే చెప్పాడులే

By:  Tupaki Desk   |   23 Dec 2017 11:32 AM GMT
చిరు నిజమే చెప్పాడులే
X

టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంత మంది హ్యాపీగా ఉన్నారో తెలియదు గాని అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు. సంతోషమంటే మామూలు సంతోషం కాదు అఖిల్ మొదటి సినిమా అలా హిట్ టాక్ తెచ్చుకుందో లేదో సంబరాలు మొదలెట్టేశారు. మొత్తానికి అఖిల్ ఒక ట్రాక్ లో పడ్డాడని నాగార్జున కూడా కొంచెం బరువు తగ్గిందని అనుకుంటున్నారట. అయితే సినిమాలో అఖిల్ నటనకి కూడా మంచి మార్కులే పడ్డాయి.

దర్శకుడు విక్రమ్ కె కుమార్ మంచి ఎమోషనల్ ని తెరపై చూపించాడని చెప్పాలి. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్నీ మెగాస్టార్ చిరంజీవి ముందే ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పేశారు. ఆయన అందరికంటే ముందు స్పెషల్ షో వేయించుకొని సినిమాను చూశారు. అయితే మెగాస్టార్ కి అందులో అమ్మ సెంటిమెంట్ బాగా నచ్చేసిందని చెప్పారు అంతే కాకుండా ఒక సిన్ గురించి ఎంతో గొప్పగా పొగిడారు. సాధారణంగా ఇలాంటి వేడుకల్లో సినిమా గురించి అందులో నటించిన వారి గురించి పొగడడం సాధారణ విషయం. అందరు ఎదో కామన్ గా అనుకున్నారు గాని చిరంజీవి చెప్పింది అక్షరాలా నిజమని సినిమా చూసిన తరువాత అనకుండా ఉండలేరు. ఎందుకంటే అఖిల్ మదర్ సెంటిమెంట్ కి సంబందించిన సిన్ లో చాలా బాగా నటించాడు. సహ నటుడు పాత్రకు తగ్గట్టు నటిస్తేనే సిన్ లో ఉండే ఇతర నటులు అందుకు తగ్గట్టుగా నటించడానికి ప్రయత్నిస్తుంటారు.

అయితే అదే తరహాలో అఖిల్ నటించడంతో అమ్మ పాత్రను చేసిన రమ్య కృష్ణ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఒక సిన్ లో అప్పటి వరకు రమ్యకృష్ణను ఆంటీ అని పిలిచే అఖిల్. కానీ నిజం తెలుసుకొని అమ్మ అని పిలిచినప్పుడు రమ్యకృష్ణ కన్నీరు పెట్టుకోవడం అందరిని భావోద్వేగానికి లోను చేస్తుంది. నిజానికి చిరుకు అలాంటి ఫీల్ కలిగింది కాబట్టే ఆ విధంగా చెప్పారు అని ఇప్పుడు సినిమాను చూసినవారు అంటున్నారు.