Begin typing your search above and press return to search.
రచ్చ: వెటరన్ హీరోలు ఏమిటీ బిగ్ ఫైట్
By: Tupaki Desk | 2 Jan 2020 9:02 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) మీటింగ్ లో రసాభాస ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మీడియా లైవ్ లోనే ఇరువురు వెటరన్ హీరోల నడుమ అసహనం బయట పడడం మా సభ్యుల్లోనే చర్చకు తావిచ్చింది. మా డైరీ లాంచ్ వేదిక పై హీరో రాజశేఖర్ పరుచూరి గోపాల కృష్ణ వంటి సీనియర్ నుంచి ఎగ్రెస్సివ్ గా మైక్ లాక్కుని గౌరవించక పోవడం పై ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే గాక రాజశేఖర్ వ్యవహరించిన తీరుపై సీరియస్ అయ్యారు. ఈ వేదికపై ఉన్న పెద్దలు ముగ్గురూ రాజశేఖర్ తీరు పై సీరియస్ అవ్వడం చర్చకు వచ్చింది. రెబల్ స్టార్ కృష్ణం రాజు- చిరంజీవి- మోహన్ బాబు వంటి పెద్దలు రాజశేఖర్ తీరు పై తీవ్రంగా గర్హించారు. అంతేకాదు తనని అనునయించేందుకు ప్రయత్నించినా వేదికపై ఎమోషన్ అదుపు తప్పింది. రాజశేఖర్ తనని అణచి వేస్తున్నారు అంటూ ఎమోషన్ అవ్వడం కనిపించింది.
``ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే సరికాదని అనిపించింది. ఎంత సౌమ్యంగా మాట్లాడుకుందాం అనుకున్నా.. ఇలా చేస్తారా? అంటూ చిరంజీవి వేదికపైనే సీరియస్ అయ్యారు. అయితే మా డైరీ వేడుకలో ఈ గొడవ అంతా వెల్ ప్లాన్డ్ గా జరిగినదేనని.. రసాభాస చేద్దాం అని అనుకుని చేశారని చిరు వ్యాఖ్యానించడం సంచలనమైంది. ఇలా చేస్తే పెద్దలైన మేం ఏమీ చేయలేం అంటూ మెగాస్టార్ సీరియస్ అయ్యారు. అంతేకాదు ఈ వేదికపై రాజశేఖర్ వ్యవహరించిన తీరుపై యాక్షన్ కమిటీ సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిందేనని రెబల్ స్టార్ కృష్ణం రాజు వ్యాఖ్యానించారు.
మా డైరీ వేదికపై మాట్లాడిన రాజశేఖర్ ఎమోషన్ అదుపు తప్పడమే గాక.. కృష్ణంరాజు- మోహన్‌బాబు- చిరంజీవి కాళ్లకు నమస్కారం చేశారు. మాలో గొడవలున్నాయి. మార్చిలో కొత్త కార్య వర్గం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. మా ఇంట్లో కూడా బాగా తిట్టారు. మా కోసమే నా బెంజ్ కార్ ని పోగొట్టుకున్నాను!! అంటూ రాజశేఖర్ ఎమోషన్ అయ్యారు. ఇంట్లో ఎందుకు అంతలా పనిచేస్తున్నావ్ అని తిట్టారని అన్నారు. అందరం కలిసే నడవాలని చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారు అంటూ రాజశేఖర్ వ్యాఖ్యానించారు. కానీ ఇక్కడ నిప్పును కప్పిపుచ్చితే పొగ వస్తుంది. `మా`లో గొడవలున్నాయి. అవి అందరికీ తెలియాలనే చెబుతున్నా. రియల్ లైఫ్ లో హీరోగా పనిచేస్తుంటే తొక్కేస్తున్నారు.. అని ఎమోట్ అయ్యారు.
దీంతో తీవ్ర అసహనానికి గురైన చిరంజీవి.. ``మేం చెప్పిన మాటకు ఎవరూ విలువ ఇవ్వలేదు. మా మాటలకు గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఇక్కడ ఎందుకు? ఎందుకిలా సభను రసాభాస చేస్తారు? రాజశేఖర్ మాటలను తీవ్రం గా ఖండిస్తున్నాను. ఎంతో సజావుగా సాగుతున్న సభలో గౌరవం లేకుండా ఇలా పెద్దల చేతి నుంచి మైక్ లాక్కుని ఎలా పడితే అలా మాట్లాడడం ఏం బాగోలేదు. ఇప్పుడు కూడా నేను స్పందించక పోతే.. మీరిచ్చే పెద్దరికానికి అర్థం ఉండదు`` అంటూ సీరియస్ అయ్యారు. ఆవేశానికి పోకుండా సౌమ్యంగా ఉండాలని అందరినీ వారించే ప్రయత్నం చేశారు. అయినా రాజశేఖర్ వేదిక దిగువ నుంచి ఎమోషన్ అవుతూ మాట్లాడడం సభ్యుల్లో చర్చకు వచ్చింది.