Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ కోసం స్టార్ హీరో కొత్త ప్ర‌య‌త్నం!

By:  Tupaki Desk   |   28 Dec 2019 5:51 PM GMT
ఫ్యాన్స్ కోసం స్టార్ హీరో కొత్త ప్ర‌య‌త్నం!
X
తెలుగులో తొలి త‌రం న‌టులు ఎన్టీఆర్‌ - నాగేశ్వ‌ర‌రావుల‌కు ఎంత మంది అభిమానులున్నా వాళ్ల‌కంటూ ప్ర‌త్యేకంగా అభిమాన సంఘాలు అంటూ వుండేవి కావు. ఆయితే వారి త‌రువాత వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి మాత్రం అభిమాన సంఘాల‌కు ప్ర‌త్యే స్థానాన్నిచ్చారు. దాంతో ప్ర‌తీ జిల్లాల్లోనూ అభిమాన‌ సంఘాలు ఏర్ప‌డ్డాయి. చిరు సినిమా వ‌స్తోందంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా వుండ‌దు. అంత‌లా త‌న ఎదుగుద‌ల కోసం అండ‌గా నిలిచిన అభిమానుల కోసం ఎవ‌రూ చేయ‌ని ప‌నిని మెగాస్టార్ చిరంజీవి చేయ‌డానికి శ్రీ‌కారం చుట్టిన‌ట్టు తెలుస్తోంది.

నాలుగు ద‌శాబ్దాలుగా త‌నకు అండ‌గా నిలిచి త‌న ఎదుగుద‌ల‌కు కార‌కులైన అభిమానుల కోసం చిరంజీవి ఇన్సూరెన్స్ చేయించ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టికే అందుకు సంబంధించిన కార్య‌క్ర‌మాల్ని ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయానికి శ్రీ‌కారం చుడుతున్నార‌ని అంతా అంటున్నారు. బ్ల‌డ్ బ్యాంక్‌ - ఐ బ్యాంక్ ల‌ని స్థాపించి ప్ర‌త్యేక గుర్తింపు కార్డుల్ని కూడా ప్ర‌వేశ‌పెట్టిన చిరు అభిమానుల‌కు జీవిత భీమా చేయిస్తూ హీరోగా కొత్త చ‌రిత్ర‌కు నాందీ ప్ర‌స్థావ‌న చేయ‌బోతున్నారు.

ప్ర‌మాద వ‌శాత్తు అభిమానుల్లో ఎవ‌రైనా చ‌నిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ భీమా వుంటుంద‌ని, గ‌త కొంత కాలంగా బ్ల‌డ్ బ్యాంక్‌ - ఐ బ్యాంక్ కోసం శ్ర‌మిస్తున్న అభిమానులంద‌రినీ ఈ ప‌థ‌కంలోకి తీసుకురాబోతున్నార‌ట‌. అభిమానుల‌కు పెద్ద‌న్న‌గా చిరు చేస్తున్న ఈ స‌హాయంపై ఇండ‌స్ట్రీ అంతా చ‌ర్చించుకుంటోంది. ఇదే చ‌ర్చ దేశ‌వ్యాప్తంగా వున్న హీరోల అభిమానుల్లోనూ మొద‌లుకాబోతోంద‌ని చెబుతున్నారు.