Begin typing your search above and press return to search.
శ్రుతిహాసన్ ఈవెంట్ స్కిప్.. షాకిచ్చే సంగతి చెప్పిన చిరు
By: Tupaki Desk | 8 Jan 2023 6:06 PM GMTఇటీవల `వీరసింహారెడ్డి` ప్రీరిలీజ్ వేడుకలో వేదిక ఆద్యంతం గొప్పగా సందడి చేసిన శ్రుతిహాసన్ ఆదివారం సాయంత్రం వైజాగ్ ఏయు గ్రౌండ్స్ లో జరిగే `వాల్తేరు వీరయ్య` ప్రీరిలీజ్ వేదికపైనా తనదైన గ్లామర్ తో మురిపిస్తుందని మెగాభిమానులు ఆశించారు. కానీ చివరి నిమిషంలో శ్రుతిహాసన్ ఈ ఈవెంట్ కి రాలేదని తెలిసి అంతా షాకయ్యారు. మెగాభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. బాస్ ఈవెంట్ కి స్కిప్ కొట్టడమేంటి? అంటూ అంతా కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక కొన్ని మీడియాలు అయితే శ్రుతి పై నెగెటివ్ హెడ్డింగులతో బోలెడంత హడావుడి చేశాయి.
అయితే శ్రుతి ఎందుకని ఈవెంట్ కి రాలేకపోయింది? అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. తాను ప్రచార వేదికకు రాలేకపోతున్నందుకు బాధపడుతున్నానని శ్రుతి ఆవేదనగా సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది. అంతేకాదు.. చిరు-బాబి సహా టీమ్ ని క్షమాపణలు కోరింది. శ్రుతిహాసన్ స్వయంగా సామాజిక మాధ్యమాల్లో ఈ మిస్సింగుకి కారణం తెలిపారు. తాను ఈ వేడుకను మిస్సవుతున్నానని దానికి కారణం తన అనారోగ్యం అని తెలిపింది.
అయితే ఆ అనారోగ్యం ఏమిటో తెలియక ఇప్పటివరకూ అభిమానులు కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. తాజాగా వాల్తేరు వీరయ్య ప్రీఈవెంట్ వేదికపై మెగాస్టార్ చిరంజీవి అసలు కారణం చెప్పారు. శ్రుతికి జ్వరం ఒళ్లు నొప్పులు.. రాలేకపోతున్నందుకు సారీ చెప్పింది. ఈ విషయాన్ని కన్వే చేయమని తనని కోరినట్టు చిరు వెల్లడించారు. కరోనా అని సందేహం వచ్చి టెస్టులు చేయించుకుందని కూడా చిరంజీవి తెలిపారు. అయితే శ్రుతి తాజా అనారోగ్య పరిస్థితికి చిరు విచారం వ్యక్తం చేసారు. తనకు కేవలం జ్వరం వచ్చింది.. కోవిడ్ టెస్టులు నెగెటివ్ గా రావాలని అన్నారు.
ఇక వాల్తేరు వీరయ్య సినిమా కోసం మైనస్ డిగ్రీల చలిలోను శ్రుతి చూపించిన ప్రొఫెషనలిజానికి హ్యాట్సాప్ చెప్పారు చిరు. తన అందాన్ని పొగడకుండా ఆగలేకపోయారు బాస్. త్వరలోనే నీక్కొంచెం అందమెక్కువ.. నాక్కొంచెం తొందరెక్కువ! పాట రిలీజవుతుందని కూడా వెల్లడించారు. ఈ డ్యూయెట్ లో చిరు-శ్రుతి రొమాన్స్ ఒక రేంజులో ఉంటుందని ఇప్పటికే విడుదలైన లిరికల్ టీజర్ వెల్లడించింది.