Begin typing your search above and press return to search.

శ్రీజ‌కి చిరు 35 కోట్ల ఖరీదైన ప్లాట్ గిప్ట్!

By:  Tupaki Desk   |   4 Jan 2023 7:15 AM GMT
శ్రీజ‌కి చిరు 35 కోట్ల ఖరీదైన ప్లాట్ గిప్ట్!
X
మెగాస్టార్ చిరంజీవి కి కుటుంబ‌మంటే ఎంతో ఇష్టం. పండుగ‌లు వేటిని మిస్ కారు. అందుబాటులో ఉంటే త‌ప్ప‌కుండా కుటుంబంతో సెల‌బ్రేట్ చేసుకుంటారు. సంక్రాంతి పండుగ వ‌చ్చిందంటే? కుమార్తెలు..అల్లుళ్లు...కొడుకు..కోడ‌లు..మ‌న‌వళ్ల‌తో క‌లిసి బెంగుళూరూ లోనూ సొంత ఫామ్ హౌస్ లో సెల‌బ్రేట్ చేసుకుంటారు. ఇంకా చిన్న చిన్న పండుగ‌లు వ‌చ్చినా? చిరు గుమ్మం దాట‌రు.

ఆయ‌న‌కు ఇల్లు అన్నా..కుటుంబ‌మ‌న్నా ఎంతో ఇష్టం. అందులోనూ చిన్న‌కుమార్తె శ్రీజ అంటే ఇంకా అంత‌కు మించిన ఇష్టం చూపిస్తారు. శ్రీజా అడ‌గాలే గానీ? ఆయ‌న చేయ‌న‌దంటూ ఉండ‌దు. తాజాగా శ్రీజ కోసం ఏకంగా 35 కోట్ల ఖ‌రీదుగ‌ల ఓ ప్లాట్ బ‌హుమ‌తిగా ఇచ్చారుట‌. హైదరాబాద్ ఎమ్మెల్యే కోల‌నీలో ఆ ఇల్లు ఉన్న‌ట్లు స‌మాచారం.

ఆ ఇంటిలో స‌కల‌ సౌక‌ర్యాలు ఉన్నాయ‌ట‌. ఇంటి విష‌యంలో శ్రీజ‌కు న‌చ్చిన‌ట్లుగా డిజైన్ చేసుకోమ‌ని చెప్పారుట‌. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ల ఇష్టాన్ని బ‌ట్టి ఇల్లు ఉండాలి అన్న‌ది చిరు నిబంధంన‌. ఆ మ‌ధ్య చిరంజీవి పాత ఇంటిని ఇలాగే త‌న‌కు కావాల్సిన విధంగా రీ మోడ‌లింగ్ చేయించారు. అందుకు కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసారు.

ఇప్పుడు కుమార్తె శ్రీజ‌కు అదే ర‌క‌మైన వెసులు బాటు క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఇంటిని చిరు తాను తీసుకున్నడ్వాన్సుల తో కోనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. అప్ క‌మింగ్ రిలీజ్ ల ద్వారా వ‌చ్చిన ఆదాయంతో చిరు శ్రీజ‌కి ఇచ్చిన గిప్ట్ గా చెప్పొచ్చు.

ఇక శ్రీజ -క‌ళ్యాణ్ దేవ్ లు వేర్వేరు గా ఉంటున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలొస్తున్న సంగ‌తి తెలిసిందే. వీటిపై వాళ్లిద్ద‌రు ఇంత వ‌ర‌కూ స్పందించ‌లేదు. అలాగే ఇటీవ‌లే కొత్త ఏడాదిని పుర‌స్క‌రించుకుని శ్రీజ‌ 2024ని కొత్త‌గానూ ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు.

ఇక చిరంజీవి సంక్రాంతి కానుక‌గా 'వాల్తేరు వీర‌య్య‌'తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతోన్న ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.