Begin typing your search above and press return to search.
చిరు స్పెషల్ ట్రీట్ కి షాక్ అయ్యారు
By: Tupaki Desk | 25 Jun 2019 10:51 AM GMTఎంత ఎత్తుకి ఎదిగినా ఒదగటం అనేది అందరి వల్ల అయ్యేది కాదు. కానీ నూటా యాభై సినిమాలు చేసినా ఎవరూ అందుకోలేని స్టార్ డం ని అనుభవిస్తున్నా చిరంజీవి మాత్రం తానెప్ప్పుడు మెగాస్టార్ అనే ఫీలింగ్ ని ఎక్కడ ప్రదర్శించకపోవడం ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే. తోటి నటీనటులైనా మీడియా మిత్రులైనా ఒకేలా చూడటం ఆయన శైలి. ఇది మరోసారి బయటపడింది.
విశ్వసనీయ సమాచారం మేరకు చిరు తన ఇంట్లో మీడియా ఫోటోగ్రాఫర్స్ కి ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చారట. కారణం ప్రత్యేకంగా ఏమి లేదు కానీ సైరా షూటింగ్ మొదలైనప్పటి నుంచి మీడియాకు అందుబాటులో లేరు కాబట్టి ఓసారి అందరిని పలకరిద్దామని ఇలా పిలిచారట. రాజకీయ ప్రస్తావన లేకుండా కేవలం సైరాకు సంబంధించిన విశేషాలతో పాటు ఆర్ ఆర్ ఆర్ గురించి కొంత డిస్కషన్ వచ్చినట్టుగా సమాచారం దీని తాలూకు ఫోటోలు ఏవి బయటికి రాలేదు.
చిరు ప్రతిఒక్కరిని పేరు పేరునా పలకరించి యోగక్షేమాలు కనుకున్నట్టు తెలిసింది. నిజానికి ఇది ప్రమోషన్ కోసం కాదని చెప్పొచ్చు. సైరా విడుదలకు ఇంకా చాలా టైం ఉంది. ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేసిన ఆగస్ట్ 22కే ఇంకా రెండు నెలలు వెయిట్ చేయాలి. అటుపై ఇంకో రెండు నెలలు. ఈ నేపథ్యంలో సైరా గురించి పబ్లిసిటీ ఇప్పటికిప్పుడు అవసరం లేదు. అయినా కూడా చిరు పిలవడంలోని ఆంతర్యం రిలేషన్ షిప్ మానేజ్మెంట్ తప్ప మరొకటి కాదు. హిట్ అయితే చాలు మహా బిల్డప్ ఇచ్చే కొందరు కొత్త హీరోలతో పోలిస్తే చిరుకి శిఖరం అనే మాట చాలా చిన్నదని అక్కడికి వెళ్లి వచ్చిన వారు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం