Begin typing your search above and press return to search.

సురేఖ లేక‌పోతే నేను లేను - చిరంజీవి

By:  Tupaki Desk   |   9 Sep 2015 9:37 AM GMT
సురేఖ లేక‌పోతే నేను లేను - చిరంజీవి
X
వృత్తిగ‌త జీవితాన్ని వ్య‌క్తి గ‌త జీవితాన్ని రెండిటినీ స‌మ‌ర్థంగా బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్‌ ని సాగించానంటే అందుకు కార‌ణం నా జీవిత భాగ‌స్వామి సురేఖ స‌పోర్టేన‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. జీవితంలో, కెరీర్‌ లో నేను ఎదుర్కొన్న ఎన్నో ఒత్తిడులు ఇట్టే క‌రిగిపోయేవంటే అది నా భార్య ఇచ్చిన మోర‌ల్ స‌పోర్ట్ వ‌ల్లే. నాకు చ‌ర‌ణ్ అనే కానుక‌ను ఇచ్చింది. బంగారం లాంటి ఇద్ద‌రు ఆడ‌బిడ్డ‌ల్ని ఇచ్చింది. జీవితాంతం నా వెన్నంటే ఉంది. మా కుటుంబం అంతా క‌లిసే ఉంటున్నాం అంటే ఫ్యామిలీకి అత్యంత ప్రాధాన్య‌త‌నివ్వ‌డం వ‌ల్లే. నాతో పాటే అన్ని బాధ్య‌త‌ల్ని స‌మానంగా పంచుకుంది కాబ‌ట్టేన‌ని చిరంజీవి సురేఖ‌తో ఉన్న అనుబంధాన్ని చిట్‌ చాట్‌ లో చెప్పారు.

సురేఖ అంటే ఎంత ఇష్ట‌మో నాన్న‌గారు అన్నా అంతే ఇష్టం. నేను న‌టుడుని అవ్వ‌డానికి ఆయ‌నే కార‌ణం. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మొగ‌ల్తూరు నుంచి సినీప‌రిశ్ర‌మ‌కు వెళ్లారాయ‌న‌. న‌టుడిగా నిరూపించుకోవాల‌నుకున్నారు. ఆయ‌న స్నేహితులు నిర్మించిన సినిమాల్లో న‌టించారు. ఆయ‌న ఓ పోలీస్ కానిస్టేబుల్ అయినా న‌టుడిగా రాణించాల‌నుకున్నారు. కానీ అది ఓ కోరిక‌గానే మిగిలిపోయింది కానీ పెద్ద న‌టుడు కాలేక‌పోయారు. అయితే ఆ కోరిక నాతో తీర్చుకోవాల‌నుకుని న‌న్ను ఎంతో ఎంక‌రేజ్ చేశారు. అయితే నేను హీరోని అయ్యాక డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్ లు చేస్తుంటే ఎంతో బాధ‌ప‌డేవారు. భ‌య‌ప‌డేవారు. న‌న్ను తెలుగు ప్ర‌జ‌ల‌కు అంకిత‌మిచ్చారాయ‌న‌. ఆయ‌న లేనందుకు మిస్స‌య్యాన‌న్న బాధ ఉంది. క‌నీసం చ‌ర‌ణ్ మొద‌టి సినిమాని థియేట‌ర్‌ లో చూశాక ఆయ‌న వెళ్లినందుకు సంతోషిస్తున్నా.. అని చిరంజీవి ఎమోష‌న‌ల్‌ గా మాట్లాడారు.