Begin typing your search above and press return to search.

పెద‌నాన్న ఆఫర్ కాద‌న్న మెగా ప్రిన్సెస్?

By:  Tupaki Desk   |   6 April 2020 5:15 AM GMT
పెద‌నాన్న ఆఫర్ కాద‌న్న మెగా ప్రిన్సెస్?
X
పెద‌నాన్న చిరంజీవికి మెగా డాట‌ర్ నిహారిక ఎంత స్పెషలో చెప్పాల్సిన ప‌నే లేదు. పాన్ ఇండియా సినిమా `సైరా-న‌ర‌సింహారెడ్డి`లో తూనీగ‌లా తుర్రుమ‌నే పాత్ర‌లో అయినా ఆఫ‌రివ్వాల‌ని ప్ర‌త్యేకించి ఆ పాత్ర‌ను క్రియేట్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డికి చెప్పారంటేనే అర్థం చేసుకోవాలి. ఇక అప్ప‌టికే నిహారిక కెరీర్ అంతంత మాత్ర‌మే. కోటి ఆశ‌ల‌తో టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా వెలిగిపోవాల‌ని ఎంట్రీ ఇచ్చినా ఆశించిన‌ది కాస్తా ద‌క్క‌నే లేదు. మెగా ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తో ఎంట్రీ ఇచ్చిన అదేమీ నిల‌బెట్ట‌లేదు. ఆ కుటుంబం నుంచి హీరోయిన్ కాబ‌ట్టి గ్లామ‌ర్ ఎలివేషన్ విష‌యంలో కొన్ని హ‌ద్దులేర్ప‌డ్డాయి. స‌రిగ్గా అదే ఇమేజ్ చాలా ఆఫర్ల‌కు అడ్డంకిగా మారింది. డాడీ కండీష‌న్లు పెట్ట‌డంతో నిహారిక ప‌రిమితంగానే న‌టించాల్సిన స‌న్నివేశం ఉంది మ‌రి. కానీ ఇక్క‌డున్న పోటీ ప్ర‌పంచంలో అలా నెట్టుకు రావ‌డం అంటే అంత ఈజీ కాదు. ఈ విష‌యం ఇప్ప‌టికే నిహారిక‌కు బాగా అర్ధ‌మైంది. అందుకే సినిమాలు త‌గ్గించి వెబ్ సిరీస్ ల వైపు దృష్టి మ‌ళ్లించింది. భ‌విష్య‌త్ సినిమా డిజిట‌ల్ దే కాబ‌ట్టి..అక్క‌డ స‌క్సెస్ అయినా పుంజుకునే ఛాన్సుంటుంద‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది.

అడ‌ప‌ద‌డ‌పా సినిమాలు చేస్తున్నా! మొద‌టి ప్రాధాన్య‌త వెబ్ సిరీస్ ల‌కు ఇస్తున్న‌ట్లు తాజా స‌న్నివేశాన్ని బ‌ట్టి తెలుస్తోంది. ఇక మెగా నిర్మాత అరవింద్ స్థాపించిన `ఆహా` ప్లాట్ ఫాం ఎలాగూ అందుబాటులో ఉంటుంది కాబ‌ట్టి...స‌రిగ్గా వినియోగించుకోగ‌లిగితే నిహారిక ఇక్క‌డ రాణించవ‌చ్చు. అయితే ఇదంతా అమ్మ‌డి తెలివి తేట‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఆ విష‌యాలు ప‌క్క‌న‌బెడితే మెగా డాట‌ర్ ని ఎలివేట్ చేయాల‌ని పెద‌నాన్న చిరంజీవి..అన్న‌య్య రామ్ చ‌ర‌ణ్ గ‌ట్టిగానే సాయ‌ప‌డుతుస్తున్నారు. అందుకే పాన్ ఇండియా మూవీ సైరా న‌ర‌సింహారెడ్డిలో గిరిజన యువ‌తిగా ఛాన్స్ దక్కింది. సినిమాలో ఇలా క‌నిపించి అలా వెళ్లిపోయే రోల్ అయినా మెగాస్టార్ సినిమాలో క‌నిపించ‌డం అంటే ఓ అదృష్టంగా భావించి అందులో న‌టించింది.

నీహారిక‌కు ఆ ఒక్క ఛాన్సే కాదు. బ్యాక్ టు బ్యాక్ మెగాస్టార్ ఆఫ‌ర్లు ఇస్తుండ‌డం ప్ర‌స్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మెగాస్టార్ న‌టిస్తోన్న 152వ చిత్రం ఆచార్య‌లో మ‌రో రోల్ ఆఫ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. పెద‌నాన్న ప్రోద్భ‌ల‌మో..లేక కొర‌టాల క‌థ‌కు అవ‌స‌ర‌మో తెలీదు కానీ ఆచార్య‌లో నిహారిక ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే ఈసారి మ‌రీ తెరపై అలా క‌నిపించి ఇలా వెళ్లిపోయే పాత్ర‌లా కాకుండా... క‌థ‌లో కీల‌కంగా మెరిసే పావుగంట పాత్ర అయినా ద‌క్కుతుందా? అన్న‌ది చూడాలి. ఏవో ఇలా ఐదారు డైలాగులు.. నాలుగైదు సీన్ల నిడివి అయినా ఉంటే ఆ పాత్ర‌కు ఓ గుర్తింపు ఉంటుంది. మ‌రి ఆ ఛాన్స్ అయినా ఉందా.. లేదా? చూడాలి.