Begin typing your search above and press return to search.
గురువుకు ఖరీదైన బహుమానం ఇచ్చిన ఉయ్యాలవాడ!!
By: Tupaki Desk | 28 Aug 2018 7:36 AM GMTటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి - బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్ లకు దాదాపు 35 ఏళ్లుగా మంచి స్నేహం ఉంది. ఇద్దరు కూడా పలు సందర్బాల్లో కలుసుకుంటూ ఉంటారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా అమితాబచ్చన్ పలు సార్లు సినిమాలు చేయాలని కోరాడు. చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఒత్తిడి చేసిన వారిలో ప్రధానంగా అమితాబ్ కూడా ఉన్నాడు. వీరిద్దరి మద్య ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే సైరా చిత్రంలో అమితా బచ్చన్ నటిస్తున్నాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పారతలో అమితాబచ్చన్ నటిస్తున్నాడు.
ఇప్పటికే అమితాబచ్చన్ కు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. చిరంజీవితో ఉన్న సన్నిహిత్యం కారణంగానే ఈ చిత్రంలో నటిస్తున్నట్లుగా అమితాబచ్చన్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రాన్ని స్వయంగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు కనుక అమితాబ్ కనీసం పారితోషికం కూడా తీసుకోవడం లేదని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. పారితోషికం తీసుకుని గెస్ట్ పాత్రలో నటించడం అనేది తమ స్నేహంను కించపర్చడమే అని అమితాబ్ భావించాడు. పారితోషికంను సున్నితంగా తిరష్కరించాడు.
అమితాబ్ పారితోషికంకు నో చెప్పడంతో చిరంజీవి అత్యంత ఖరీదైన బహుమానంను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపు మూడు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అమితాబ్ కు చిరంజీవి అందించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సైరాలో అమితాబ్ కు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అవ్వడంతో అమితాబ్ కు పెద్ద పార్టీ ఇచ్చి - ఈ ఖరీదైన బహుమానంను ఇచ్చి చిరంజీవి సాగనంపినట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది. పారితోషికంను వద్దన్న అమితాబ్ బహుమానం అవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సైరా చిత్రంలో అమితాబ్ ఉండటం వల్ల బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడినది.