Begin typing your search above and press return to search.

మామయ్య గ్రీన్‌ సిగ్నల్‌ లభించిందట!

By:  Tupaki Desk   |   27 May 2019 12:20 PM GMT
మామయ్య గ్రీన్‌ సిగ్నల్‌ లభించిందట!
X
వరుసగా ఫ్లాప్‌ లతో సతమతం అయిన మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ కు ఎట్టకేలకు 'చిత్రలహరి' చిత్రంతో కాస్త ఊరట దక్కిందని చెప్పుకోవాలి. చిత్రలహరి చిత్రం ఘన విజయం కాకున్నా కూడా తేజ్‌ కు కాస్త ఆశలు కల్పించినట్లయ్యింది. చిత్రలహరి సెట్స్‌ పై ఉన్న సమయంలోనే మారుతి దర్శకత్వంలో మూవీకి ఓకే చెప్పాడు. యూవీ క్రియేషన్స్‌ లో మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌ మూవీ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉంది. కాని కథ విషయంలో తేజ్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

వరుస ఫ్లాప్‌ ల నేపథ్యంలో తన ప్రతి సినిమా కథను తనకు సన్నిహితులైన రచయితల టీంకు వినిపించడంతో పాటు మామయ్య చిరంజీవి మరియు అంకుల్‌ అల్లు అరవింద్‌ ల సిగ్నల్‌ తీసుకోవాలనుకుంటున్నాడు. ఈ క్రమంలో సినిమా సినిమాకు గ్యాప్‌ ఎక్కువ వచ్చినా పర్వాలేదు కాని హడావుడిగా సినిమాలు చేయవద్దని తేజ్‌ భావిస్తున్నాడట. తాజాగా మారుతి వెళ్లి రెండు గంటల పాటు స్క్రిప్ట్‌ ను నరేట్‌ చేశాడట.

మారుతి చెప్పిన కథలో చిన్న చిన్న మార్పులు చేర్పులను చిరంజీవి మరియు అల్లు అరవింద్‌ సూచించినట్లుగా తెలుస్తోంది. మారుతి ఫైనల్‌ గా స్క్రిప్ట్‌ సిద్దం చేశాడని అతి త్వరలోనే సినిమాను సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. స్క్రిప్ట్‌ ఓకే అయిన నేపథ్యంలో తాజాగా దర్శకుడు మారుతి సీనియర్‌ నటులైన సత్యరాజ్‌.. మురళి శర్మ.. రావు రమేష్‌ లతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. వారిని ఈ చిత్రంలో నటింపజేయబోతున్నాడు. హీరోయిన్‌ ఎంపిక మరియు ఇతర ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ లో మారుతి బిజీ అయ్యాడు.